సంగెం, ఏప్రిల్ 21 : వడదెబ్బ తగిలి మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని కాట్రపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాట్రపల్లి గ్రామానికి చెందిన గీసగోని శ్రీదేవి (36) ఈనెల 20న ఆదివారg మొక్కజొన్న చేను కంకి విరవడానికి వ్యవసాయ పనులకు వెళ్లింది. పనుల వద్దనే వాంతులు, విరోచనాలు కావడంతో తోటి కూలీలు వెంటనే ఇంటికి తీసుకొచ్చారు.
ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత కూడా వాంతులు, విరోచనాలు కావడంతో 108లో వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీదేవి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.