చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలి
వేయిస్తంభాల ఆలయాన్ని నిర్మించేందుకు 72 ఏండ్లు పట్టినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని, నాడు ఎలాంటి ఆరిటెక్ట్, ఇంజినీర్ లేకుండా అద్భుతంగా నిర్మించారని, ఇక్కడ శిథిలావస్థకు చేరిన కల్యాణ మండపాన్ని మరో వెయ్యేళ్లు ఉండేలా పునర్నిర్మించి శివుడికి అంకితం చేశామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
- వెయ్యేళ్లు ఉండేలా వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం
- యునెసో గుర్తింపు కోసం కృషి చేస్తా : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపం ప్రారంభం
- మండపంలో వైభవంగా రుద్రేశ్వరస్వామి కల్యాణోత్సవం
హనుమకొండ చౌరస్తా, మార్చి 8: వేయిస్తంభాల ఆలయాన్ని నిర్మించేందుకు 72 ఏండ్లు పట్టినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని, నాడు ఎలాంటి ఆరిటెక్ట్, ఇంజినీర్ లేకుండా అద్భుతంగా నిర్మించారని, ఇక్కడ శిథిలావస్థకు చేరిన కల్యాణ మండపాన్ని మరో వెయ్యేళ్లు ఉండేలా పునర్నిర్మించి శివుడికి అంకితం చేశామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని వేయిస్తంభాల గుడిలో కుటుంబ సమేతంగా పూజలు చేసి కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. మండపంలో శాంతి కల్యాణం, పుష్పార్చన, వాస్తుశాంతి నిర్వహించారు. అంతకు ముందుకు వారికి ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాకతీయుల కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. మధ్యయుగకాలం నాటి ఈ గుడి.. సామాజిక, ఆర్థిక, సాంసృతిక కేంద్రంగా ప్రత్యేకతను చాటుకుందని, ఇకడున్న మండపంలో గ్రామసభలు, నాట్య కార్యక్రమాలు నిర్వహించుకునేవారని చెప్పారు. ఆలయానికి యునె సో గుర్తింపు కోసం కృషి చేస్తానని, త్వరలోనే ఆలయ ప్రాంగణమంతా గార్డెన్, సౌండ్స్ అండ్ లైటింగ్స్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇక్కడ నంది విగ్రహం ఎంతో లైవ్లీగా ఉందన్నారు. స్థపతులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ మహతార్యంలో భాగస్వాములై పనిచేశారని చెప్పారు. ధ్వంసమైన పిల్లర్ల స్థానంలో బ్లాక్ గ్రానైట్‌తో అచ్చం పాతవాటిలా ఉండే స్తంభాలను తయారుచేశారన్నారు.
శిల్పులకు ఘనసన్మానం
19 సంవత్సరాలుగా కష్టపడి వేయిస్తంభాల కల్యాణమండపాన్ని పునర్నిర్మించిన శిల్పకారులను, స్థపతి శివకుమార్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, నంది విగ్రహాన్ని రూపొందించిన శిల్పులను కేంద్ర మంత్రి ఘనంగా సన్మానించారు. స్తంభాల డాక్యుమెంటేషన్, మారింగ్లో కీలకంగా వ్యవహరించిన ఏఎస్సై ఉద్యోగులను సత్కరించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ వేయిస్తంభాల ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, విజయచందర్‌రెడ్డి, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆర్కియాలజీ అధికారులపై కేంద్ర మంత్రి సీరియస్
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆర్కియాలజీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై కిషన్‌రెడ్డి మాట్లాడకముందే ఆర్కియాలజీ అధికారి మల్లేశం ‘ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి’ అని మైక్‌లో అనడంతో మంత్రితో పాటు అక్కడ ఉన్న బీజేపీ నాయకులు మండిపడ్డారు. తర్వాత తేరుకున్న అధికారి ‘ఇప్పుడు పసునూరి దయాకర్ మాట్లాడాలి’ అని, ఎలాంటి ప్రొటోకాల్ పాటించకుండా ఎంపీని పిలవడంపై అందరూ సీరియస్ అయ్యారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

