సుబేదారి, జూలై18 : కాకతీయ జూలాజికల్ పార్క్‌కు తెల్లపులి వచ్చింది. హనుమకొండ హంటర్ రోడ్డులోని జూపార్కులో శుక్రవారం వైట్ టైగర్ ఎన్క్లోజర్ను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూపార్కు జంతువులను ప్రతి ఒక్కరూ దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని అన్నారు. హైదరాబాద్ జూపార్కుకు దీటుగా వరంగల్ జంతు ప్రదర్శనశాలను అభివృద్ధి చేయడానికి రూ. 4 కోట్ల నిధులు కేటాయించామని పేర్కొన్నారు.
త్వరలోనే లయన్తోపాటు మరికొన్ని పెద్ద జంతువులను ఇక్కడి తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ భీమానాయక్, జిల్లా అటవీశాఖ అధికారి అనుజ్ అగర్వాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.