జనగామ రూరల్, మార్చి 31 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సాగునీరందక దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించేందుకు ఆదివారం ఎర్రవల్లి నుంచి ప్రత్యేక వాహనంలో కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ ద్వారం పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నాయకులు ఘన స్వాగతం పలికారు. ‘జై కేసీఆర్…జైజై కేసీఆర్.. బీఆర్ ఎస్ జిందాబాద్..’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దారి పొడువునా కేసీఆర్ వాహనం పై పూలు చల్లుతూ మహిళలు నీరాజనం పలికారు. కేసీఆర్ ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియోజకవర్గ నాయకులను కేసీఆర్‌కు పరిచయం చేశారు. మరో వైపు రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం మాకోసం ఉద్యమ నేత కేసీఆర్ వచ్చారని మహిళలు చ ర్చించుకోవడం కనిపించింది.
అన్నదాతలకు రైతుబం ధు సాయం అందించిన నేత అని, గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధా న్యాన్ని కొనుగోలు చేసి ఆదుకున్న మహానేత అంటూ కొనియాడారు. కేసీఆర్ పాలనలో వేసవిలోనూ చెరువు ల్లో గోదావరి జలాలు నింపారని, కరువు లేకుండా చూ శారని పలువురు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు వస్తున్నాయని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని పలువురు రైతులు చర్చించుకోవడం కనిపించింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్య ర్థి క్యామ మల్లేశం, ఎంపీపీలు మేకల కళింగరాజు, గోవర్ధన్, జడ్పీటీసీ శ్రీనివాస్, నాయకులు బక్క నాగరాజుయాదవ్, డాక్టర్ రాజమౌళి, గద్దల నర్సింగరావు, మా ర్కెట్ మాజీ చైర్మన్లు బాల్దె సిద్ధిలింగం, గాడిపల్లి ప్రే మలతారెడ్డి, బండ పద్మ, బాల్దె విజయ, జనగామ మున్పిపల్ చైర్పర్సన్ పోకల జమున, బీఆర్ఎస్ జనగామ, బచ్చన్నపేట మండలాల అధ్యక్షులు బైరగోని యాదగిరిగౌడ్, బొడిగం చంద్రారెడ్డి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు చినబోయిన రేఖ, జిల్లా నాయకులు ఇర్రి రమాణారెడ్డి, బండ యాదగిరిరెడ్డి, పెద్ది రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, చందు పాల్గొన్నారు.
లింగాలఘనపురం : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నెల్లుట్ల వద్ద పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. దేవరుప్పుల మండలానికి కేసీఆర్ వెళ్తున్నారని తెలుసుకున్న ప్రజలు ఉదయం 8గంటల వరకే జనగామ-సూర్యాపేట జాతీయ రహదారి వద్దకొచ్చారు. గు లాబీ కండువాలు కప్పుకుని కేసీఆర్ వాహనం రాగానే పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.
బచ్చన్నపేట : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ మండల శ్రేణులు పెద్ద సంఖ్యలో పెంబర్తిలోని హైవే వద్దకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఇర్రి రమణారెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కనకయ్య, సర్పంచ్ల ఫో రం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, నాయకులు చల్లా శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్, ఉపేందర్‌రెడ్డి, జావీద్, షబ్బీర్, సిద్ధులు, వేణుగోపాల్, అనిల్‌రెడ్డి, నర్సిరెడ్డి, సిద్ధ్దారెడ్డి, కిష్టయ్య, ఫిరోజ్, మల్లారెడ్డి, కైసర్, నర్సింహులు, రాజుగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.