కాజీపేట, ఏప్రిల్ 29 : వేసవిలో తిరుమల-తిరుపతి దైవదర్శనాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి తిరుపతికి వారాంతపు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే, జూన్ నెలలో మొత్తం 16 ట్రిప్పులను నడుపుతున్నామని పేర్కొన్నారు. ఈ రైళ్లు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి 07253 నంబర్‌తో మే నెలలో 06, 13, 20, 27న, జూన్‌లో 3, 10, 17, 24 తేదీల్లో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి తిరుపతికి మరుసటి రోజు బుధవారం ఉదయం 9గంటలకు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి 07254 నంబర్‌తో మే నెలలో 7, 14, 21, 28న జూన్‌లో 4, 11, 18, 25 తేదీల్లో ప్రతి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు గురువారం ఉదయం 8 గంటలకు కాజీపేటకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు కాజీపేటలో బయల్దేరి వయా చర్లపల్లి, వికారాబాద్, గుంతకల్, గుత్తి, రాయచూర్, కడప, రేణిగుంట రైల్వేస్టేషన్ల మీదు గా నడుస్తుందన్నారు. మొత్తం 17 బోగీలతో 2 ఏఏసీ(డబ్ల్యూ), 1 ఏసీసీ(ఎన్), 8 సీఎన్, 4 జనరల్ బోగీలు, 2 ఎస్ఎల్ఆర్ బోగీలు ఉంటాయని, టి కెట్ రిజర్వేషన్ ఉందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.