పర్వతగిరి, జనవరి 23: కాకతీయులు కట్టించి న శివాలయ పునఃప్రతిష్టాపనను ఈనెల 26 నుంచి 28 వరకు వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం పర్వతగిరిలో పర్వ తాల శివాలయ పునఃప్రతిష్ఠాపనపై స్థానిక ఎమ్మె ల్యే అరూరి రమేశ్‌తో కలిసి సంబంధిత అధికారు లు, ప్రజాప్రతినిధులతో సమీక్ష చేశారు. ఈ సంద ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మన చరి త్రను కాపాడే పవిత్ర కార్యాన్ని గొప్పగా నిర్వహి స్తున్నామని అన్నారు. ప్రజలు, భక్తులు భారీ ఎత్తు న తరలిరావాలని పిలుపునిచ్చారు. భక్తులకు వస తుల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా అంద రూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు స మన్వయంతో పనిచేసి ఈ దైవ కార్యాన్ని విజయ వంతం చేయాలని కోరారు.
భక్తుల కోసం భజన, తాగునీటి వసతులు కల్పించినట్లు తెలిపారు. రిజర్వాయర్‌లో బోటింగ్ ఉందని, భక్తులు కుటుంబంతో వచ్చి శివుడిని దర్శించుకుని, సరదాగా బో టింగ్ చేయవచ్చునని అన్నారు. బోటింగ్ వసతు లను పరిశీలించారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల వాహనాల కోసం కావాల్సినంత పార్కింగ్ వసతి కల్పించినట్లు అధికారులు, స్ధానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. పర్వతగిరి గ్రామం నుంచి శివాలయం వర కు రవాణా సదుపాయం కల్పించా మన్నారు. వృద్ధులు, వికలాంగులు గుట్ట మీదకు వెళ్లి దర్శించుకునేందుకు వీలుగా వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. పునఃప్రతిష్టాపన గొప్పగా ఉండేలా లైటింగ్, మొక్కలు, వసతులతో సుందరీకరణ చేశామని చెప్పారు.
కార్యక్ర మంలో సమన్వయ కర్త వందేమాతరం రవీందర్రావు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రా వు, సూపరింటెండెంట్ ఇంజినీర్ మల్లేశం, విద్యు త్ శాఖ ఎస్ఈ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, డీఆర్డీఓ సంపత్‌రావు, పంచాయ తీ రాజ్ ఎగ్జి క్యూటివ్ ఇంజినీర్ శంకరయ్య, జడ్పీ సీఈఓ సాహితీమిత్ర, ఆర్డీఓ మహేందర్‌జీ, పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ, డీపీఓ కల్పన, స్థ్ధానిక సర్పంచ్ మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీటీసీ మాడ్గుల రాజు, బొట్ల మహేంద్ర, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.