మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 16 : ప్రజల మహా సంకల్పం నెరవేరింది. జలదృ శ్యం ఆవిష్కృతమైంది. ‘పాలమూరు’ ప్రాజె క్టు ఫలం కళ్ల ముందు సాక్షాత్కరించింది. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయాల న్న అపరభగీరథుడు, ప్రగతి ప్రదాత కేసీఆర్ కలల ప్రాజెక్టు జాతికి అంకితమైంది. శనివా రం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ పూజలతో పునీతమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కంట్రోల్‌రూంలో స్విచ్ఆన్ చేసి బాహుబలికి మిం చిన మోటర్‌ను ఆన్ చేశారు. దీంతో సిస్ట ర్న్ నుంచి వెల్లువలా కృష్ణమ్మ ఎగిసిపడిం ది. నార్లాపూర్ రిజర్వాయర్ వైపు బిరబిరా పరుగులు పెట్టింది. ఈ దృశ్యాన్ని తిలకించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి. అతిర థ మహారథులు హాజరవగా.. నల్లమల ప్రాంతం పులకించింది. విడుదలైన జలాల కు పూజలు చేసి హారతిపట్టారు. ఇంజినీరింగ్ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టమని పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రారంభించారు. సీఎం సభ కు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 49 వా ర్డుల నుంచి వార్డు కౌ న్సిలర్లు, వార్డు నాయకు లు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఆయా వార్డులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 21వ వార్డు కౌన్సిలర్ ఆనంద్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రజ లు బయలు దేరారు. మున్సిపల్ చైర్మన్ న ర్సింహులు, వైస్‌చైర్మన్ గణేశ్, వార్డుల కౌన్సిలర్లు సీఎం కేసీఆర్ సభకు వెళ్లారు. ఆయా వార్డు లో జైకేసీఆర్, జైశ్రీనన్న అన్న నినాదాలు మార్మోగాయి.
దేవరకద్రలో..
దేవరకద్ర, సెప్టెంబర్ 16 : దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ శ్రే ణులు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు సీఎం కేసీఆర్ కొల్లాపూర్ నియోజకవర్గ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి రవీందర్, తాసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాసులు, మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు శ్రీకాం త్యాదవ్, విజయవెంకటేశ్ , ఆంజనేయులు, బాలరాజు పాల్గొన్నారు.
బాలానగర్‌లో..
బాలానగర్, సెప్టెంబర్ 16 : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నార్లాపూర్ వెట్ రన్‌ను శనివారం ప్రారంభించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జెడ్పీటీసీ జర్పుల కల్యాణిలక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బస్సులను జెండా ఊపి ప్రారంభించి తరలివెళ్లారు. అదేవిధంగా మండలంలోని చింతకుంటతండా గ్రామ పంచాయతీకి కలశం బిందెను అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
జడ్చర్లలో..
జడ్చర్ల, సెప్టెంబర్ 16 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన రిజర్వాయర్‌లోకి పంప్‌హౌ స్ నుంచి నీటిని ఎత్తిపోసే మోటర్లను శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభకు జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ఆయా గ్రామాల సర్పంచులు తమతమ గ్రామాలకు కృష్ణమ్మ నీటిని తీసుకురావడానికి కలశాలను తీసుకెళ్లారు. నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన రిజర్వాయర్‌లోకి నీటి విడుదల సందర్భంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు కొల్లాపూర్ మండలంలోని నా ర్లాపూర్ రిజర్వాయర్ వద్ద కృష్ణమ్మ ను చూడటానికి బస్సులు, ఇతర వాహనాల్లో తరలివెళ్లారు.
కోయిలకొండలో..
కోయిలకొండ, సెప్టెంబర్ 16 : కొల్లాపూర్‌లో ని ర్వహించిన సీఎం కేసీఆర్ భహిరంగ సభకు కో యిలకొండ మండలం నుంచి శనివారం భారీ గా రైతులు, నాయకులు తరలివెళ్లారు. కోయిలకొండలో సీఎం సభకు వెళ్తున్న బస్సులను నారాయయణపేట బీఆర్ఎస్ కన్వీనర్ రవీందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య ఉన్నారు.
చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల్లో..
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), సెప్టెంబర్ 16 : కొల్లాపూర్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన సభ కు చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల్లోని ప లు గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివెళ్లారు.
మిడ్జిల్‌లో..
మిడ్జిల్, సెప్టెంబర్ 16 : కొల్లపూర్లో నిర్వహించే సీఎం సభకు మండలం నుంచి అన్ని గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్, జె డ్పీటీ సీ శశిరేఖ, నాయకులు సుధాబాల్రె డ్డి, ప్రతాప్‌రెడ్డి, జంగిరెడ్డి, వెంకట్‌రెడ్డి, బాలయ్య, బుచ్చ య్య, జైపాల్‌రెడ్డి, శివప్రసాద్, ఆంజనేయు లు, భీమ్రాజు, బంగారు, మల్లేశ్, శేఖర్, గోపా ల్, జగన్‌గౌడ్, రాజు, వెంకటేశ్ పాల్గొన్నారు.
హన్వాడలో..
హన్వాడ, సెప్టెంబర్ 16 : నాగర్‌కర్నూల్ జి ల్లా కొల్లాపూర్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు శనివారం మండలంలోని వివిధ గ్రామాల నుం చి బీఆర్ఎస్ శ్రేణులు, రైతు లు, ప్రజలు, మహిళలు తరలివెళ్లారు. మండ లం నుంచి 30 బ స్సులు, 15 కార్లలో ప్ర జలు సభకు వెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ కొండ లక్ష్మయ్య, మాజీ జెడ్పీటీసీ నరేందర్, నాయకులు రమణారెడ్డి, జంబులయ్య, బాలయ్య, చెన్న య్య, హరిచందర్, యాదయ్య, మహేందర్, ఖాజాగౌడ్, శ్రీనివాసులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రాజాపూర్‌లో..
రాజాపూర్, సెప్టెంబర్ 16 : నాగర్‌కర్నూల్ జిల్లా నార్లాపూర్ వద్ద నిర్మించిన సాగు, తాగునీటి ప్రాజెక్టును శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమానికి మండల రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. మండల కేంద్రంలో ఎంపీపీ సుశీల, ప్రజాప్రతినిధులు జెం డా ఊపి బస్సు యాత్రను ప్రా రంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మోహన్‌నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, బీఆర్ఎస్ యూత్వింగ్ మండలాధ్యక్షుడు వెంకటేశ్, తాసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీదేవి, స ర్పంచులు,ఎంపీటీసీలు వెళ్లారు.
అడ్డాకులలో..
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 16 : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించేందుకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేసేందుకు అడ్డాకుల మండలంలోని వాడవాడనుంచి ప్రజలు తరలివెళ్లా రు. అడ్డాకుల మండల కేంద్రంతోపాటు పెద్దమునగల్‌చేడ్, చిన్నమునగల్చేడ్, బలీదుపల్లి, వర్నె, కన్మనూరు, శాఖాపూర్, కందూరు, పోన్నకల్, రాచాల, గుడిబండ, కాటవరం, తిమ్మాయిపల్లి, తిమ్మాయిపల్లి తండా తదితర గ్రామాల నుంచి ప్రజ లు బస్సులు, కార్లు, డీసీఎంల, జీపులు ఇలా ఎవరికి వారు వాహనాల్లో తరలివెళ్లారు. వారి వెంట అడ్డాకుల జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, విద్యార్థులు తరలివెళ్లారు.
మూసాపేటలో..
మూసాపేట, సెప్టెంబర్ 16 : మూసాపేట మండ ల కేంద్రంతోపాటు నిజాలాపూర్, జానంపేట, కొమిరెడ్డిపల్లి, వేముల, నందిపేట, దాసరిపల్లి, చక్రాపూర్, పోల్కంపల్లి, తిమ్మాపూర్, స్ఫూర్తితండా, సంకలమద్ది, బంగ్లగడ్డ, మహ్మద్‌హుస్సేన్‌పల్లి తదితర గ్రామాల నుంచి ప్రజాప్రతినిధు లు, నాయకులు సీఎం కేసీఆర్ సభకు తరలివెళ్లా రు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ కళావతి, కొండయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహాయాదవ్, సింగిల్‌విండో చైర్మన్ బండా వెంకటేశ్వర్‌రెడ్డి తరలివెళ్లారు.