ఖిలావరంగల్ : గ్రేటర్ వరంగల్ 38వ డివిజన్ ఖిలా వరంగల్ రోడ్డులోని హనుమాన్ విగ్రహం వద్ద గత ఏప్రిల్ నెల నుంచి తాగునీరు నిరంతరం వృథాగా పోతుంది. పైపులైను లీకేజీ కారణంగా ప్రతిరోజు వేల లీటర్ల మంచినీరు రోడ్డుపై ప్రవహిస్తునన్నా, దీనిని అరికట్టడానికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు పైపులైనుకు మరమ్మత్తులు చేయాల్సిన అధికారులు కేవలం తాగునీరు రోడ్డుపై ప్రవహించకుండా మురికి కాలువలోకి మళ్లించి చేతులు దులుపుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల నీటి వృథా ఆగకపోగా సమస్యను తాత్కాలికంగా పక్కకు పెట్టారు తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదని వాపోతున్నారు.
సమస్యకు పరిష్కారం కరువు
నెలల తరబడి కొనసాగుతున్న ఈ నీటి వృథా గురించి స్థానికులు పదేపదే అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసినప్పటికీ ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నాయకులు విఫలమవుతున్నారని విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి.
తాగునీటి ప్రవాహం వల్ల 18 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహ మూర్తికి పూజలు చేయలేని దుస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నీతి యువతపై ఉన్నతాధికారులు పాలకులు తక్షణమే దృష్టి సారించి లేక అయిన పైపులైనుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.