భద్రకాళీ.. శరణం మమ
వరంగల్ ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకరణలో బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో నిండుగా కొలువుదీరి ప్రకృతికి ప్రతీకగా సాక్షాత్కరించారు.
- శాకంబరీగా దర్శనమిచ్చిన అమ్మవారు.. ఆలయానికి పోటెత్తిన భక్తులు
వరంగల్, జూలై 29 : వరంగల్ ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకరణలో బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో నిండుగా కొలువుదీరి ప్రకృతికి ప్రతీకగా సాక్షాత్కరించారు. శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఒక అలంకరణలో దర్శనమ్చిన భద్రకాళీ అమ్మవారు 15వ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి( వ్యాస పౌర్ణమి) రోజు శాకంబరీగా దర్శనమిచ్చారు.
ప్రధాన అర్చకులు శేషు ఆధ్వర్యంలో ఉదయం 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అర్చకులు వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని ఆరు గంటలపాటు శాకంబరీగా అలంకరించారు. ఉదయం 9.30 గంటల నుంచి భద్రకాళీని దర్శంచుకునేందుకు భక్తులకు అనుమతించారు. గంటల తరబడి అమ్మవారి దర్శనం కోసం క్యూలో బారులు తీరారు. దాతల సహాయంతో ప్రసాద వితరణ చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈవో రామల సునీత పర్యవేక్షించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కాగా, భద్రకాళి శాకంబరీ, గురుపౌర్ణమి వేడుకలతో నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భద్రకాళీతోపాటు సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

