కాశీబుగ్గ/కరీమాబాద్/వరంగల్‌చౌరస్తా/నర్సంపేట/మట్టెవాడ/పోచమ్మమైదాన్, మార్చి 18: వరంగల్ మూడో డివిజన్ పైడిపల్లిలోని కాకతీయ పరపతి సంఘం ఆధ్వర్యంలో హోలీ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌ల చైర్మన్ల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారి ఇట్యాట హరికృష్ణ పాల్గొని మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడి భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ కోటి లింగం, సంఘం ఉపాధ్యక్షడు రవీందర్‌రెడ్డి, కోశాధికారి ఇట్యాల శ్రీరాములు, సభ్యులు నీరుపెల్లి శివప్రసాదు, ఉప్పుల రాజు, బొల్లం రమేశ్, కొండం కిశోర్, వీ శంకర్, ముంజ సుదర్శన్ పాల్గొన్నారు. అలాగే, పైడిపల్లిలో జరిగిన వేడుకల్లో రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఎల్లావుల లలిత పాల్గొన్నారు. సహజ రంగులనే వాడాలని ఆమె ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎల్లావుల కుమార్‌యాదవ్, టీఆర్ఎస్ పైడిపల్లి అధ్యక్షుడు పండుగ రవీందర్‌రెడ్డి, లింగం కోటి, ఆర్బీఎస్ సభ్యులు లింగం సాంబమూర్తి, కొండం కిశోర్, బొల్లం రమేశ్, ఇట్యాల శ్రీరాములు, నీరుపెల్లి శివప్రసాద్, ఉప్పుల రాజు, వీ శంకర్ పాల్గొన్నారు.
అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీలన్నీ రంగులమయమయ్యాయి. వరంగల్‌లోని 24, 26, 27, 28వ డివిజన్లలోని కృష్ణకాలనీ, పిన్నవారివీధి, గిర్మాజీపేట, రామన్నపేట, విశ్వకర్మవీధి తదితర ప్రాంతాల్లో యువజన సంఘాలు, పరపతి సంఘాలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో యువతీ యువకులు పాల్గొని కేరింతలు కొట్టారు. టీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి జేపీన్రోడ్డులో పారిశుధ్య కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. వరంగల్ 25వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బస్వరాజు శిరీషా శ్రీమాన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి నాయకుడు మడిపెల్లి సుశీల్గౌడ్ ఆధ్వర్యంలో మట్టెవాడలో జరిగిన వేడుకల్లో స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
వరంగల్ రామన్నపేటలోని మోక్షారామం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ సారయ్య నివాసంలో జరిగిన వేడుకలలో టీఆర్ఎస్ నాయకుడు బండ్ల సురేందర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ 29వ డివిజన్ నాయకుడు కొడకండ్ల సదాంత్ ఆధ్వర్యంలో రఘునాథ్కాలనీలో వేడుకలు జరిగాయి. పోచమ్మమైదాన్ పరిధిలోని కొత్తవాడ, ఆటోనగర్, దేశాయిపేట, ఎల్బీనగర్, తిలక్‌రోడ్డులో ఒకరి ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగారు. ఆటోనగర్‌లోని లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి స్థానికులు హోలీ వేడుకలు జరుపుకున్నారు. కొత్తవాడ, కల్యాణ్‌నగర్, పోచమ్మమైదాన్, ఎల్బీనగర్, దేశాయిపేటరోడ్డు, తిలక్‌రోడ్డులో టీఆర్ఎస్ శ్రేణులు రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. వాసవీ కాలనీలోని ఇన్నర్ వీల్ క్లబ్‌కు చెందిన మహిళా కుటుంబ సభ్యులు, దంపతులు రంగులు పోసుకుంటూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
నర్సంపేట పట్టణంలో హోలీ వేడుకలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రజలు రంగులు చల్లుకుంటూ సంబురాల్లో మునిగితేలారు. మహిళలు, అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సైతం సహజసిద్ధ రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం గీసుగొండ మండలం కొమ్మాలలోని లక్ష్మీనర్సింహాస్వామి జాతరకు పెద్ద ఎత్తున పట్టణం నుంచి తరలివెళ్లారు. వర్ధన్నపేట మండలవ్యాప్తంగా యువకులు, చిన్నారులు, మహిళలు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సీఐ సదన్‌కుమార్, ఎస్సై రామారావు తగిన చర్యలు చేపట్టారు. నర్సంపేట మండలంలోని గ్రామాలు, పల్లెలు, తండాల్లో ప్రజలు సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. చెన్నారావుపేట మండలంలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నారులు కలర్ స్ప్రేగన్స్తో ఒకరిపై మరొకరు రంగు నీళ్లు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు.
ప్రజాప్రతినిధులు, యువత హోలీ వేడుకలను జరుపుకుంది. ఖానాపురం మండలవ్యాప్తంగా వివిధ పార్టీల రాజకీయ నాయకులు, యువతీ యువకులు, మహిళలు, చిన్నారులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ.. ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ.. హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ఎస్సై తిరుపతితో కలిసి రంగులు చల్లుకున్నారు. దుగ్గొండి మండలంలో కులమతాలకతీతంగా ప్రజలు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకున్నారు. యువత గ్రామ పురవీధుల్లో తిరుగుతూ కేరింతలు కొడుతూ టమాటాలు, కోడిగుడ్లను ఒకరిపై ఒకరు కొట్టుకొంటూ ఆనందంగా గడిపారు. ఎస్సై వంగల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది స్టేషన్లో హోలీ వేడుకలు జరుపుకున్నారు. జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య పాల్గొన్నారు.
వేడుకగా రంగుల పండుగ..
సంగెం/రాయపర్తి/పర్వతగిరి/గీసుగొండ/నెక్కొండ: సంగెం మండలంలో హోలీ పర్వదినాన్ని శుక్రవారం వేడుకగా జరుపుకున్నారు. పిల్లలు పెద్ద వాళ్లతో పోటీపడి రంగులను స్ప్రే చేశారు. సంగెం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై హరిత ఆధ్వర్యంలో పోలీసులు వారి కుటుంబ సభ్యులతో కలిసి రంగులు చల్లుకుని సంబురాలు చేసుకున్నారు. శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా పోలీసులు గ్రామాల్లో పర్యవేక్షించారు. రాయపర్తి మండలంలోని 39 గ్రామాల పరిధిలో హోలీ పర్వదిన వేడుకలను సకలవర్గాల ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఏటా చప్పట్ల పౌర్ణమి సందర్భంగా కామదహనం మరుసటి రోజు జరుపుకునే రంగోలి వేడుకలను మండల ప్రజలు ఈ ఏడు రెట్టించిన ఉత్సాహంతో జరుపుకున్నారు. రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా హోలీ ఆటలకు దూరంగా ఉన్న యువతీ యువకులు.. ఈసారి ఘనంగా నిర్వహించారు. అనంతరం బంధుమిత్రులకు పరస్పరం రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘ఎర్రబెల్లి దయన్న యువసేన’ మండల వ్యవస్థాపక అధ్యక్షుడు బదావత్ వీరూనాయక్ కాట్రపల్లిలో హోలీ ఆడుతున్న యువకులకు బాదం పాలు పంపిణీ చేశారు.
అలాగే, మొరిపిరాల, ఆర్అండ్ఆర్ కాలనీలో హోలీ ఆడుకుంటున్న వృద్ధులు, మహిళల వద్దకు వెళ్లి రూ. 2 వేల చొప్పున పంచి వారిలో ఆనందాన్ని నింపారు. పర్వతగిరిలో జరిగిన వేడుకల్లో జడ్పీటీసీ బానోత్ సింగ్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. గీసుగొండ మండలంతోపాటు గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15, 16వ డివిజన్లలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు సూరి, శ్రీనివాస్, వీరేందర్, రాజు, శ్రీకాంత్, ప్రశాంత్, అశోక్, వెంకట్, నాగరాజు, సుమన్ పాల్గొన్నారు. నెక్కొండలో జరిగిన వేడుకల్లో సొసైటీ చైర్మన్ మారం రాము, మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ వీరభద్రయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కే భిక్షపతి, భాస్కర్‌రెడ్డి, పీ సత్యం, ఈదునూరి యాకయ్య పాల్గొన్నారు.