నర్సంపేట, ఫిబ్రవరి 28: నర్సంపేటలోని సిద్ధార్థ డిగ్రీ, పీజీ కళాశాల, కాకతీయ గ్రాడ్యుయేట్స్ కళాశాల, అక్షర, డఫోడిల్స్, మాంటిస్సోరి స్కూళ్లలో సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ చంద్రమౌళి మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌పై ఇష్టం, ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే సైన్స్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రమేశ్, సిద్ధార్థ డిగ్రీ, పీజీ, ఇంటర్ కళాశాల ప్రిన్సిపాళ్లు గోగుల ప్రభాకర్‌రెడ్డి, వీరమల్ల మాధవరెడ్డి, బిట్స్ చైర్మన్ డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, మాంటిస్సోరి స్కూల్ కరస్పాండెంట్ ఎర్ర జగన్మోహన్రెడ్డి, డఫోడిల్స్ స్కూల్ కరస్పాండెంట్ చింతల నరేందర్ పాల్గొన్నారు. అలాగే, లక్నేపల్లి బాలాజీ టెక్నోస్కూల్లో నిర్వహించిన ఎగ్జిబిట్స్ను జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పరిశీలించారు. నిరంతర పరిశోధనలు, సొంత ఆలోచనలు కలిగినప్పుడే విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. సీవీ రామన్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మూఢనమ్మకాలకు దూరంగా ఉండొచ్చు
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మట్టెవాడ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం పూసారాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. సైన్స్‌పై అవగాహన పెంచుకుంటే మూఢనమ్మకాలకు దూరంగా ఉండొచ్చని హెచ్ఎం సూచించారు. 130 మంది విద్యార్థులు 70 రకాల ఎగ్జిబిట్లు తయారు చేసినట్లు ఆయన తెలిపారు. వరంగల్ కృష్ణకాలనీ ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు 60 రకాల ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. అనంతరం యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు గుండె పనితీరు, మానవుడి మెదడును కాపాడే పుర్రె నిర్మాణంపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. వర్ధన్నపేట మండలంలోని వర్ధన్నపేట, నల్లబెల్లి, ఉప్పరపల్లి, ల్యాబర్తి, ఇల్లంద ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. చెన్నారావుపేటలోని కేజీబీవీలో స్పెషలాఫీసర్ ఎం జ్యోతి, జల్లి స్కూల్ అసిస్టెంట్ గణిత ఉపాధ్యాయుడు జగన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
విద్యార్థులు రంగోలి, వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్, డ్రాయింగ్, సైన్స్ ఎగ్జిబిట్లు, డ్రామా తదితర అంశాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎంఐఎస్ స్వప్న, సీఆర్పీ శిల్ప పాల్గొన్నారు. అలాగే, సిద్ధార్ధ గురుకులంలో విద్యా సంస్థల చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఖానాపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్, కేజీబీవీ, సైనిక్ పాఠశాలలో విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎగ్జిబిట్లను ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు పరిశీలించారు. సర్పంచ్‌లు చిరంజీవి, ప్రవీణ్‌కుమార్, ఎంపీటీసీ భారతి, సుభాన్‌బీ, లింగమ్మ, హెచ్ఎంలు దూళం రాజేందర్, శ్రీధర్, రాజేందర్, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
విజ్ఞానమే మానవ వికాసానికి మూలాధారం
శాస్త్ర విజ్ఞానమే మానవ వికాసానికి మూలాధారమని కేజీబీవీ ప్రత్యేక అధికారి సునీత అన్నారు. గురుకులంతోపాటు రుద్రగూడం ప్రాథమిక పాఠశాలలో సైన్స్ డే నిర్వహించారు. విద్యార్థులు ప్రయోగాలతోపాటు రంగవల్లులు వేశారు. రుద్రగూడెం హెచ్ఎం అనంతుల విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరంగల్ మండిబజార్‌లోని సుప్ఫా హైస్కూల్లో సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ తయ్యాబా నాజ్నీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు సైన్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి హాజరై ఎగ్జిబిట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ అజీత్ మహ్మద్, డాక్టర్ బుస్రా ఫాతిమా, డాక్టర్ మదీనా తహర్, ముంతాజ్, ఎం ఏ ఖాలీక్ జుబేర్ పాల్గొన్నారు. గీసుగొండ మండలం కొమ్మాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఎం విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాము, సీతాదేవి, రాజిరెడ్డి, మారుతి, కుమరస్వామి, లలిత, శంకర్ పాల్గొన్నారు. పోచమ్మమైదాన్ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సైన్స్ డే సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఫేర్, వ్యాసరచన, వకృత్వ పోటీలు, సైన్స్ అధ్యాపకులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నర్సంపేటరోడ్డులోని శ్రీచైతన్య స్కూల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లను వరంగల్ ట్రాఫిక్ సీఐ వడ్డె నరేశ్‌కుమార్ పరిశీలించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్ ఫేర్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై రావేళ్ల రామారావు, డాక్టర్ నల్లగొండ సందీప్‌కుమార్, ప్రిన్సిపాల్ రత్తయ్య పాల్గొన్నారు. ఎల్బీనగర్లోని లర్నర్స్ల్యాండ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పలు ఎగ్జిబిట్ల ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి. చైర్మన్ తాళ్ల మల్లేశం, ఇన్చార్జి శ్రవణ్, నళిని పాల్గొన్నారు. ములుగురోడ్డులోని లోటస్ నేషనల్ స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది.
డాక్టర్ రజియా అంజుమ్, హెచ్ఎం జానకీదేవి పాల్గొన్నారు. వరంగల్ 21వ డివిజన్లోని ప్రభుత్వ చార్‌బౌళి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. సీకేఎం కళాశాల సైన్స్ అధ్యాపకుడు ఐ గోపి, హెచ్ఎం టీ కవిత పాల్గొన్నారు. దేశాయిపేటలోని ప్రభుత్వ సహాయక నెహ్రూ మెమోరియల్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తవాడ ఆటోనగర్‌లోని ప్రభుత్వ గిర్మాజీపే పాఠశాలలో సైన్స్ డే ఉత్సవాలను ఘనంగా జరిపారు. పర్వతగిరి మండలం చింతనెక్కొండలోని విజ్ఞానభారతి విద్యాలయంలో 50 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. కరస్పాండెంట్ అక్కినపెల్లి సతీశ్‌కుమార్ విజేతలకు బహుమతులు అందజేశారు. గోపనపెల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగాలను ప్రదర్శించారు. సర్పంచ్ పంజా మహేశ్, ఎంపీటీసీ రమేశ్, ఎస్ఎంసీ చైర్మన్ బెల్లం కుమారస్వామి, హెచ్ఎం జే లింగమూర్తి, టీ పూర్ణచందర్రావు విద్యార్థులను అభినందించారు. పర్వతగిరిలోని విజ్డమ్ పాఠశాలలో హెచ్ఎం అనుమాండ్ల దేవేందర్ నేతృత్వంలో ఎగ్జిబిట్స్ ప్రదర్శన, క్విజ్ పోటీలు నిర్వహించారు. డైరెక్టర్లు సుధాకర్, శ్రీనివాస్, టీచర్లు రోజా, ఇంద్రజ పాల్గొన్నారు.