కాశీబుగ్గ, ఫిబ్రవరి 28 : మార్కెట్ యార్డుల్లో ఈపీవోస్ మిషన్స్ ద్వారా దడువాయిలతో వేమెంట్ ఇంటిగ్రేషన్ వందశాతం అమలు చేయాలని వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి పాలకుర్తి ప్రసాద్‌రావు అన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని మిర్చియార్డును సోమవారం ఆయన సందర్శించారు. లాట్ స్లిప్‌ల ప్రకారం ఈపీవోస్ మిషన్స్ ద్వారా దడువాయిలతో వేమెంట్ ఇంటిగ్రేషన్ అమలును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చిన సరుకుకు లాట్ నంబర్ నమోదు చేసి ఐడీ కేటాయించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యార్డుల్లో ఈపీవోస్ మిషన్స్ ద్వారా దడువాయిలతో వేమెంట్ ఇంటిగ్రేషన్ వందశాతం అమలుకు చర్యలు తీసుకోవాలని కార్యదర్శి బరుపాటి వెంకటేష్ రాహుల్‌ను ఆదేశించారు. గ్రేడ్-2 కార్యదర్శులు తోట చందర్రావు, బియాబాని, సహాయ షరీఫ్, సూపర్వైజర్లు గంగాధర్, పాల్గొన్నారు.
లైసెన్స్ హమాలీల పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వాలి
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో లైసెన్స్ కలిగిన హమాలీ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని మార్కెట్‌యార్డు హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. సోమవారం కార్యదర్శి బరుపాటి వెంకటేష్ రాహుల్‌కు హమాలీ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. హమాలీ కార్మికులకు ఏటా రూ.3వేల బట్టలతోపాటు కుట్టుచార్జీలు ఇచ్చినట్లుగానే పిల్లలకు ఉపకార వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని వినతి పత్రంలో పెర్కొన్నారు. మిర్చియార్డులో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దామెర కృష్ణ, ఎల్లయ్య, మహేందర్ పాల్గొన్నారు.