రాయపర్తి, ఫిబ్రవరి 20: మండలంలోని రాయపర్తి, మహబూబ్‌నగర్‌లో సీసీరోడ్ల నిర్మాణ పనులను ఆదివారం ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 39 గ్రామ పంచాయతీల పరిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో సుమారు రూ. 14 కోట్ల విలువైన పనులను చేపట్టినట్లు ఆయన వివరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో రోడ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, సర్పంచ్‌లు గారె నర్సయ్య, గాదె హేమలతా రవీందర్‌రెడ్డి, పూస మధు, ఎంపీటీసీలు అయిత రాంచందర్, చిక్కొండ రజితా వీరస్వామి, లక్కం కుమార్, సురేశ్, బీరెల్లి కుమార్, పెండ్లి మల్లారెడ్డి, ఎర్ర యాకయ్య, పెంతల సంతోష్‌కుమార్, యార నర్సిరెడ్డి, కంజర్ల సాయిలు, జక్కుల దూడయ్య, బీరెల్లి కుమార్, ఎండీ నయీం, జలగం లావణ్య, పీరని యాకయ్య, మచ్చ శ్రీనివాస్, అయిత కుమార్, పీరని వెంకన్న, కుల్లా వెంకన్న పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి నిధులు
గీసుగొండ: మండలంలోని రాంపురంలో ఆదివారం రూ. 15 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను జడ్పీటీసీ పోలీసు ధర్మారావు ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు చేపట్టని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి విజయవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రడం శ్రావ్య, సర్పంచ్ గోపి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.