చెన్నారావుపేట, ఫిబ్రవరి 20: దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వడ్డూరి కుమారస్వామి అన్నారు. తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం ఎమ్మార్పీఎస్ మండల కమిటీ సభ్యుల సమక్షంలో దళిత సంఘం నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్చార్జి వడ్డూరి కుమారస్వామి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో దళితబంధు పథకం కింద వంద యూనిట్లు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా మరో రెండు వేల యూనిట్లు కేటాయిస్తామనడం హర్షణీయమన్నా రు. తెలంగాణ ప్రభుత్వానికి దళిత సంక్షేమంపై ఉన్న అభిమానానికి ఇదే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా దళితుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పెద్ది వెంటే దళితులు నడువాలని పిలుపునిచ్చారు. దళితబంధు పథకంలో భాగంగా మొదటి విడుతలో యూనిట్లకు ఎంపిక కానివారు నిరాశ పడొద్దని, రెండో దఫాలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దళితులందరికీ లబ్ధి చేకూరేలా మార్చిలో రెండు వేలకు పైగా యూనిట్లు తీసుకొస్తారని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆకులపెల్లి ఉప్పలయ్య, ఉపాధ్యక్షుడు నర్మెట్ట సాంబయ్య, గ్రామ అధ్యక్షుడు పైసా సారంగం, మైదా మాణిక్యం, పైసా రాజు, బొమ్మకంటి నర్సయ్య, ఈసంపెల్లి ఐలయ్య, జంగిలి సంపత్, తీగల అశోక్, పైసా సాంబయ్య, జంగిలి కిరణ్, ఆకులపెల్లి అజయ్ పాల్గొన్నారు.