కరీమాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ ప్రభుత్వం ఆధునిక హంగులతో శ్మశాన వాటికలను నిర్మిస్తున్నది. చివరి మజిలీకి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కరీమాబాద్ బీరన్నకుంటలోని హిందూ శ్మశానవాటికలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. నూతనంగా బర్నింగ్ ప్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టారు. వాకింగ్ ట్రాక్, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. శ్మశాన వాటికలోని గోడలపై పలు దేవుడి బొమ్మలను గీయడంతో శ్మశానవాటికకు కొత్తశోభ వచ్చింది. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 54 లక్షలతో అభివృద్ధి పనులు
తెలంగాణ ప్రభుత్వం హిందూ శ్మశాన వాటికలో రూ. 54 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తున్నది. దీంతోపాటు ఆధునిక హంగులతో నూతన నిర్మాణాలు చేపట్టింది. త్వరలోనే శ్మశాన వాటికలో పార్కును తలపించేలా గ్రీనరీతోపాటు మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టాం. అద్దె భవనాల్లో ఉంటున్న వారిలో ఎవరైనా చనిపోతే వారి కర్మకాండలు పూర్తయ్యే వరకూ కుటుంబ సభ్యులు ఉండేలా భవన నిర్మాణం చేపట్టనున్నాం.
– పల్లం పద్మ, కార్పొరేటర్ 32వ డివిజన్