వర్ధన్నపేట, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన అడుప చంద్రమౌళి ఇటీవల మృతి చెందాడు. ఆదివారం ఆయన ఇల్లందకు వెళ్లి చంద్రమౌళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే, కొత్తపల్లి గ్రామానికి చెందిన స్వామిరాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇల్లందలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల సంక్షేమం కోసం ఆసరా పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. త్వరలోనే కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేసి పింఛన్లు అందిస్తారని వివరించారు. బీజేపీ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఇల్లంద సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఉపసర్పంచ్ రాజ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకుడు పెంచాల కుమారస్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ఎంపీపీ కుమారుడి పెళ్లికి హాజరు
పర్వతగిరి: మాజీ ఎంపీపీ వల్లందాసు రంగయ్య కుమారుడి వివాహానికి మంత్రి ఎర్రబెల్లి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఆమడగాని రాజ్‌యాదవ్, సర్పంచ్ ఇస్లావత్ రమేశ్, నాయకులు దుర్గారావు, ప్రభాకర్, వెంకన్న, యాకయ్య, భాస్కర్ ఉన్నారు.