సంగెం/ఖిలావరంగల్, ఫిబ్రవరి 19: పలు బాధిత కుటుంబాలను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం పరామర్శించారు. ఇటీవల గన్ మిస్‌ఫైర్ ఘటనలో సంగెం మండలం గవిచర్లకు చెందిన హెడ్‌కానిస్టేబుల్ సంతోష్‌యాదవ్ మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సంతోష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే లోహిత గ్రామంలో దొమ్మటి ఎల్లమ్మ, తీగరాజుపల్లిలో రంగరాజు సరోజన, గాంధీనగర్‌లో కంచేటి సూర్యనారాయణ కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. అంతేకాకుండా గాంధీనగర్‌లో పోస్టాఫీస్‌ను ధర్మారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, దొనికెల మల్లయ్య, సర్పంచ్‌లు దొనికెల రమ-శ్రీనివాస్, రాయపాటి ఏకాంబ్రం, మాజీ సర్పంచ్ పత్తిపాక రమేశ్, ఎంపీటీసీ అడ్డగట్ల దుర్గారావు పాల్గొన్నారు. వరంగల్ 17వ డివిజన్ స్తంభంపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు బెంబిరి చొక్కారావు ఇటీవల మృతి చెందాడు. ఎమ్మెలే ధర్మారెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కత్తెరపల్లి దామోదర్, టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.
నర్సంపేట పట్టణంలోని 21వ వార్డులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మిత్ర యూత్ క్లబ్ సభ్యుడు రఘువీర్ తల్లి యశోదమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన అడుప చంద్రమౌళి(70) మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని జడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. అనంతరం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.