నర్సంపేట, ఫిబ్రవరి 19: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో ఆన్లైన్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీని వినియోగించుకొని ప్రతిభ చాటాలన్నారు. ఆదివారం ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక అధ్యక్ష కార్యదర్శులు పెండెం భాస్కర్, మోతె ఇంద్రసేనారెడ్డి, సునీల్, పెనాకర్రెడ్డి, అశోక్, పాశికంటి రమేశ్, జైపాల్‌రెడ్డి, బైరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
వధూవరులకు పెద్ది ఆశీర్వాదం
దుగ్గొండి/ఖానాపురం: దుగ్గొండి మండలం మహ్మదాపురం, రాజ్యాతండాలో శనివారం జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే, తొగర్రాయిలో ఇటీవల వ్యక్తి మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, సర్పంచ్ బానోత్ రవీందర్‌నాయక్, ఎంపీటీసీ చింతా లావణ్యా యుగేంధర్, టీఆర్ఎస్ నాయకులు గుండెకారి రంగారావు, కంచరకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, శంకేసి కమలాకర్, రాజా, రవీందర్‌నాయక్ పాల్గొన్నారు. ఖానాపురం మండలం కొడ్తిమాట్తండాకు లావుడ్యా రాములు-రాజమ్మ దంపతుల కుమార్తె వివాహం జరిగింది. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ గుగులోత్ సుమన్ ఉన్నారు.