దుగ్గొండి, ఫిబ్రవరి 14 : దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. సోమవారం దుగ్గొండి మండల ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంద శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని దళితులతో కలిసి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచి, దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంద శ్రీనివాస్, దుగ్గొండి మండల పరిషత్ అధ్యక్షురాలు కాట్ల కోమలాభద్రయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, ప్రతాప్, మట్వాడ చింటు, మనోజ్, నరేశ్ పాల్గొన్నారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి : మండలంలోని జాతీయ రహదారి నుంచి దుగ్గొండి మీదుగా గిర్నిబావి వరకు బీటీ డబుల్ తార్ రోడ్డు మంజూరు చేయడంతో సర్పంచ్ నానెబోయిన రాజారాం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి ఆధ్వర్యంలో సోమవారం సీఎం కేసీఆర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ నల్లబెల్లి జాతీయ రహదారి నుంచి గిర్నిబావి వరకు రూ.15 కోట్ల వ్యయంతో బీటీ డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంతోపాటు దుగ్గొండి గ్రామాల్లో సెంట్రల్ డివైడర్, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు కోసం నిధులు మంజూరుకు ఎమ్మెల్యే పెద్ది కృషిచేశారని తెలిపారు. పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, మాజీ సర్పంచులు కొత్తపెల్లి కోటిలింగాచారి, గుండాల శ్రీనివాస్, పార్టీ గ్రామ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, నాయకులు పాండవుల రాంబాబు, ప్రతాప్‌సింగ్, రామ్మూర్తి, చంద్రమౌళి, పిరికి కోర్నెల్, మాలోతు ప్రతాప్‌సింగ్, శ్రీనివాస్, నాగేశ్వర్రావు, సుమన్, రాజన్న, రవి, ఆకుల సాంబరావు, బట్టు సాంబయ్య, చేరాలు, మోహన్‌రెడ్డి, ప్రకాశ్, సమ్మయ్య, రాజు, కృష్ణ పాల్గొన్నారు.