రాయపర్తి : ప్రజావిశ్వాసాన్ని కోల్పోయి అసంబద్ధ విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం చెప్పాలని.. అదే సమయంలో ప్రజాసేవ చేస్తూ ఉత్సాహంగా ముందుకుసాగాలని మంత్ర ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం రాయపర్తి టీఆర్ఎస్ మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలు.. ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నాయని మండిపడ్డారు. పూటకో మాట, గడియకో హామీనిస్తూ ఉనికి చాటుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న బీజేపీ.. బడా ఝూఠా పార్టీగా చరిత్రలో మిగిలిపోయేందుకు సిద్ధంగా ఉందని విమర్శించారు. ఈ నెల 11న సీఎం కేసీఆర్ జనగామ పర్యటనను విజయవంతం చేసేందుకు మండలంలోని 39 గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలంతా భారీగా తరలి రావాలని కోరారు. మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, పూస మధు, గారె నర్సయ్య, ఎండీ.నయీం, గబ్బెట బాబు, ఉండాడి సతీశ్‌కుమార్, గాజులపాటి నర్మద, కాంచనపల్లి వనజారాణి, ఎనగందుల యాక నారాయణ, అయిత రాంచందర్, తాళ్లపల్లి సంతోష్‌గౌడ్, చందర్ రామ్‌యాదవ్, ఉల్లెంగుల నర్సయ్య, బాషబోయిన సుధాకర్‌యాదవ్, సూదుల దేవేందర్‌రావు, నలమాస సారయ్య, గూబ ఎల్లయ్య, గొట్టం ప్రతాప్‌రెడ్డి, కొనుకటి రాఘవులు, మహ్మద్ అశ్రఫ్‌పాషా, గూడెల్లి తిరుమల్, సత్తూరి నాగరాజు, ఎండీ.ఉస్మాన్ పాల్గొన్నారు.