ఖానాపురం, పిబ్రవరి 6 : గ్రామాల్లో ప్రాధాన్యతా క్రమం లో వందశాతం సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జడ్పీ నిధులు రూ. 6 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నదన్నారు. దీనిలో భాగంగానే అంతర్గత రోడ్ల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులను మంజూరు చేస్తున్నదన్నారు. మండల వ్యాప్తంగా రూ.1.5 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. సీసీరో డ్డు నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బత్తిని స్వప్న, మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ శాఖమూరి చిరంజీవి, ఎంపీటీసీలు మర్రి కవిత, రామస్వామి, బీ పూలు, ఎం సంపత్, వార్డు సభ్యుడు జటంగి నాగరాజు, ఎం అశోక్, డీ రమేశ్, చెన్నూరి సత్యం, బీ పూర్ణచందర్రావు, రెడ్డి నాగార్జునరెడ్డి, రాజు, వెంకట్రావు, నరహరి, రాములు పాల్గొన్నారు.
జింకురామ్తండాలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం..
రాయపర్తి: గామీణ ప్రాంతాల అభివృద్ధే సర్కారు లక్ష్యమ ని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జింకురామ్తండా గ్రామంలో ఆదివారం సీసీ రోడ్డు పనులను ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లు పూర్తి చేసుకుంటున్నామని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లికి మండల ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు ఆకుల సురేందర్‌రావు, సర్పంచ్ బానోత్ సుందర్, ఎంపీటీసీ బానోత్ శ్వేత, గ్రామ అధ్యక్షుడు గుగులోత్ దుంసింగ్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
చెన్నారంలో..
వర్ధన్నపేట: మండలంలోని చెన్నారంలో ఆదివారం సీసీరోడ్డు పనులను జడ్పీటీసీ మార్గం భిక్షపతి పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఎమ్మెల్యే అరూరి రమేశ్ సహకారంతో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే పల్లెప్రగతిలో భాగంగా వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, పల్లెప్రకృతి వనాలను నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పునుగోటి భాస్కర్‌రావు, ఉపసర్పంచ్ రాజమౌళి, రైతు బంధు సమితి అధ్యక్షుడు రంగారావు, వార్డు సభ్యులు అశోక్‌రావు, అనూష, కొమురమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ కుమారస్వామి, వెంకటేశ్ పాల్గొన్నారు.