గీసుగొండ, జనవరి 29: సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి సాధించాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఊకల్‌లో శనివారం ఆయన పర్యటించారు. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత పెరిగిందన్నారు. డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. గ్రామాల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొక్కల రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇంటింటికీ భగీరథ నీరు అందుతుందా లేదా అని ఎమ్మెల్యే స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చల్లా వెంట జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ మొగసాని నాగదేవత, ఎంపీటీసీ బేతినేని వీరారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, మండల కార్యదర్శి చల్లా వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు, సర్పంచ్‌లు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఊకల్‌కు చెందిన పార్టీ కార్యకర్త దేవుపల్లి కొమ్మాలు తల్లి లక్ష్మి మృతి చెందగా, కుటుంబ సభ్యులను పరామర్శించారు.