వర్ధన్నపేట/పర్వతగిరి, డిసెంబర్ 16: గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో సియోను ప్రార్థన మందిరం 12వ వార్షికోత్సవానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీలో రూ. 3.50 లక్షలతో నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నదని తెలిపారు. రానున్న రోజుల్లో ఇండ్లు లేని పేదలకు సొంత స్థలంలోనే పక్కా గృహం నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుందన్నారు. అనంతరం కట్య్రాల మాజీ సర్పంచ్ ఎలికట్టె భాస్కర్ ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని, టీఆర్ఎస్ కట్య్రాల గ్రామ అధ్యక్షుడు బైరి కుమారస్వామి తండ్రి లక్ష్మయ్య మృతి చెందగా, ఆయనను ఎమ్మెల్యే రమేశ్ పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బండారు మంజుల, కట్ట మహేశ్‌కు ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నా, మాజీ ఏఎంసీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, నల్లబెల్లి సర్పంచ్ ముత్యం దేవేంద్ర, ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొన్నారు. తర్వాత పర్వతగిరి మండలంలోని ఏనుగల్‌లో జీపీ వార్డు మెంబర్ తొర్ర లక్ష్మణ్ కుమార్తె శారీ ఫంక్షన్‌కు అరూరి హాజరై బాలికను ఆశీర్వదించారు. ఆయన వెంట జడ్పీటీసీ సింగ్‌లాల్, ఎంపీటీసీలు కోల మల్లయ్య, భాస్కర్, సర్పంచ్‌లు దమ్మిశెట్టి సంధ్యారాణి, తౌటి దేవేందర్, వెంకన్ననాయక్, గూడ నరేందర్, రంగు కుమారస్వామి, నర్సింగం, మార్కెట్ డైరెక్టర్ పట్టపురం ఏకాంతం, గంధం బాలరాజు పాల్గొన్నారు.