ఖానాపురం, నవంబర్ 18: రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. ఖానాపురం, బుధరావుపేట, మంగళవారిపేట, ధర్మారావుపేట, అశోక్‌నగర్‌లో గురువారం ఆయన సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ. 1960, సాధారణ రకానికి రూ. 1940 చెల్లించినట్లు తెలిపారు. మండలవ్యాప్తంగా 18 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వానకాలం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రైతులు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు సునీత, అశోక్, బాషబోయిన రాజు, గంగాధర రమేశ్, భాగ్యమ్మ, తిరుపతి, రవీందర్రావు, అచ్యుతం, ఎంపీటీసీ షేక్ సుభాన్‌బీ, బోడ భారతి, పూలు, రామస్వామి, తక్కళ్లపల్లి బాబురావు, ఉప్పు వెంకటేశ్వర్లు, మౌలానా, పైండ్ల యాదగిరి, సొసైటీ సీఈవో ఆంజనేయులు, సిబ్బంది రాజు, భీమయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తేమ శాతం 17లోపు ఉండాలి
దుగ్గొండి: ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య అన్నారు. గిర్నిబావిలో మందపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ స్థానిక ప్రజాప్రతినిధులు, పీఏసీఎస్ సిబ్బంది, అధికారులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ధాన్యంలో తేమ 17 శాతంలోపు ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీసీవో నోడల్ ఆఫీసర్ నాగనారాయణ, మందపల్లి పీఏసీఎస్ చైర్మన్ గుడిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.