హసన్‌పర్తి, డిసెంబర్ 16 : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో హసన్‌పర్తి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీలో కొఱ్ఱె మేఘనా సింధు 466/470 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించింది. అలాగే, సీఈసీలోబుర్ర రక్షిత 459, బైపీసీలో బొంత సునీత 364 మార్కులు సాధించారు. ఈ మేరకు విద్యార్థులు, ప్రిన్సిపాల్ బీ సునీతను ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ చకిలం రాజేశ్వర్‌రావు గురువారం ఘనం గా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కుమార్, చాప్‌ల, కొంరారెడ్డి, సదానందం, రఘురాం, కమలాదేవి, పద్మావతి, సాయి ప్రసాద్, సైదుల సాహెబ్, సుమలత, మాధవి పాల్గొన్నారు.
పరకాల విద్యార్థిని హర్షిత ప్రతిభ
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన గాజుల హర్షిత ప్రతిభ చూపింది. ఎంపీసీ విభాగంలో 427 సాధించి కాలేజీ టాపర్‌గా నిలిచింది. ఈ మేరకు హర్షితను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.
ఏకశిల విద్యార్థుల ప్రభంజనం
ఇంటర్ మొద టి సంవత్సరం ఫలితాల్లో ఏకశిల జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి మార్కులు సాధించినట్లు ఏకశిల విద్యాసంస్థల ఛైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన హనుమకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో అభినందించారు. ఎంపీసీ విభాగంలో బీ భవ్యశ్రీ 463 మార్కులు, మిగలిన విద్యార్థులు 463, 462, 462, 461, 460, బైపీసీలో ఎం ప్రవళిక 435 మార్కులు, మిగిలిన విద్యార్థులు 434, 433, 432, 431, సీఈసీలో ఎల్ సిరిచందన 475 మార్కులు, మిగిలిన విద్యార్థులు 475, 474, 473, 472 మార్కులు సాధించారు.
షైన్ విద్యార్థుల ప్రతిభ
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో షైన్ విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించినట్లు షైన్ విద్యాసంస్థల ఛైర్మన్ మూగల కుమార్‌యాదవ్, డైరెక్టర్లు డాక్టర్ వేణుయాదవ్, పీ రాజేంద్రకుమార్ తెలిపారు. ఎంపీసీలో పీ సాయిసాత్విక్(466 మార్కులు), వీ కౌముది(465), గణేశ్‌కుమార్ (463), కే సుశ్విక్(463), జీ విగ్నేశ్ (462), ఎన్ చేతన(461), ఎన్ నాగరాజు(460), జీ సాయితేజ(460), బీ జయపాల్(460), బైపీసీలో మొదటి ర్యాంకు సాధించిన టీ సహస్ర(435), నాగుల దీపిక(434), ఏ శ్రీజ(434), జాడి రిషిక(432), సీహెచ్ ప్రాథమ్(429), బోడ కిరణ్‌నాయక్(428), ఎండీ ఇర్ఫాన్జమల్(426) ను కళాశాల యాజమాన్యం అభినం దించింది. వీరితో పాటు ఎంపీసీలో 450 మార్కులపైన 35 మంది, బైపీసీలో 420 మార్కులపైన 28 మంది విద్యార్థులు సాధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యాసంస్థల ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్‌యాదవ్, డైరెక్టర్ రంగనాథ్, కళాశాల ప్రిన్సిపాల్ మారబోయిన రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మెలుహ కళాశాల విద్యార్థుల హవా..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో హనుమకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులోని మెలుహ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఎంపీసీలో గుడిబోయిన సాయి చిద్విలాస్ 463, కంచరకుంట్ల విశ్వతేజ 462 మార్కులు, బైపీసీలో లింగాల స్వర్ణకమల 429 మార్కులు ,రసాల చైతన్య 427 మార్కులు, ఎంఈసీలో కుంచల సంధ్యారాణి 475 మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పొన్నం రాజు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాదించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.
రెజొనెన్స్ విద్యార్థుల విజయకేతనం..
హనుమకొండ : ఇంటర్ ఫలితాల్లో రెజొనెన్స్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కళాశాల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఎంపీసీలో సిరిమల్ల సంజన 466, కొండ చరణ 464, కొత్వాలి శ్రీజ 464, పూజ గజానన్ 464, బైపీసీలో వేద పు అంకిత 436, ఓరుగంటి అక్షయ 435, చల్ల అక్షిత 434, వెచ్చ మణ్విత 434 మార్కులు సాధించారని పేర్కొన్నారు. అలాగే, ఎంపీసీలో 460 మార్కులకుపైగా, బైపీసీలో 430 మార్కులకుపైగా చాలా మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. ఈ సందర్భం గా విద్యార్థులను ఎండీ రమేశ్‌కుమార్, డైరెక్టర్లు మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, లెక్కల మహేందర్‌రెడ్డి అభినందించారు.
ఇంటర్లో బాలికల హవా
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు గురువారం రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. హనుమకొండ జిల్లా 51 శాతం ఉత్తీర్ణత సాధించింది. బాలికలు ముందు వరుసలో నిలిచారు. 18,737 మంది పరీక్షలకు హాజరు కాగా 9,638 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 9,545 మంది పరీక్షలకు హాజరుకాగా 4202 మంది ఉత్తీర్ణత (44 శాతం)సాదించారు. బాలికలు 9,192 మంది పరీక్షలకు హాజరుకాగా 5,436 మంది ఉత్తీర్ణత (61శాతం) సాధించారు. ఒకేషనల్ కోర్సుల నుంచి బాలురు 407 మంది పరీక్షలకు హాజరుకాగా 187మంది పాస్ అయ్యారు. బాలికలు 697 మంది హాజరుకాగా 425మంది ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారి గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.