నర్సంపేట రూరల్, డిసెంబర్ 9 : నర్సంపేట ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో 21వ మండల పూజా మహోత్సవాల్లో భాగంగా మాదన్నపేట పెద్ద చెరువులో గురుస్వామి వెంకటేశ్శ ర్మ మంత్రోచ్ఛణల నడుమ నర్సంపేట ఎ మ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ స్థా నిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పంబా ఆరాట్టు అత్యంత వైభవంగా జరిగింది. అయ్యప్ప దేవాలయంలో ఎమ్మెల్యే పెద్ది దంపతులు, ఏసీపీ ఫణీందర్ పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించిన అయ్య ప్ప విగ్రహాన్ని పట్టణంలో ఊరేగించారు. ఊరేగింపు వాహనాన్ని ఎమ్మెల్యే పెద్ది స్వయంగా నడిపారు. అయ్యప్ప దేవాలయం నుంచి ప్రారంభమైన ఊరేగిం పు మాదన్నపేట పెద్ద చెరువు వద్దకు సా గింది. రెండు గుర్రాలు, ఒంటెలను ఊ రేగింపు కోసం ఆలయ కమిటీ ప్రత్యేకం గా తెప్పించారు. ఉరేగింపు రథం ఎదుట మహిళలు బిందెలతో నీళ్లు పోసి మొక్క లు చెల్లించుకున్నారు. గురుస్వామి ఆధ్వర్యంలో మాదన్నపేట పెద్ద చెరువు వద్ద 3గంటల పాటు అయ్యప్పకు జలక్రీడ లు నిర్వహించారు.
తేనె, పండ్లు, జీడిప ప్పు, చెక్కర, పెరుగు, పాలు, కొబ్బరినీ రు, విభూది, పసుపు, గంధం, వివిధ రకాల పుష్పాభిషేకాలు చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి పంపాసద్ది (మహా అన్నదానం)ని అందించగా, చెరువు కట్టపై మాలధారులు, భక్తులు స హపంక్తి భోజనం చేశారు. 10వేల మం ది భక్తులకు 16క్వింటాళ్లతో మహా అన్నదానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మె ల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయ్యప్ప మాలధారులు, భక్తులకు సేవ చేసే భా గ్యం కల్పించిన అయ్యప్ప స్వామికి కృ తజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, ఎంపీపీలు మోతె కళావతి, బాదావత్ విజేందర్, వేములపల్లి ప్రకాశ్‌రావు, ఊడ్గుల సునీత, జడ్పీటీసీలు కోమాండ్ల జయ, పత్తినాయక్, గురుస్వాములు సంజీవరావు, మిడిదొడ్డి బాబురావు, వెండి రవీందర్, కోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.