వర్ధన్నపేట, నవంబర్ 22 : గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సఖీ జిల్లా ప్రతినిధి టీ.సుధ, ఎం.నిర్మాళాదేవి సూచించారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో మణికంఠ గ్రామైక్య సం ఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. మహిళలకు రాజ్యాం గం హక్కులు కల్పించిందన్నారు. మహిళలు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. వరకట్న వేధింపులు, గృహహింస, లైంగిక, యాసిడ్దాడులు, బాల్యవివాహాలు తదితర అంశాలపై సహకారం అందించనున్నట్లు చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైతే 181, 1098, 100, 08718-295014 నంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సఖీ ప్రతినిధి రాణి, వీవోఏ సంఘం ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
గ్రామాల్లో అవగాహన సదస్సులు
మండలంలోని రాయపర్తి, పెర్కవేడు, మొరిపిరాల గ్రామాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్-హన్మకొండ, సఖీ వన్‌స్టాప్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. సమావేశాలకు ఎస్సై బండారి రాజుతో పాటు సంస్థ ప్రతినిధులు టీ.సుధ హాజరై మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మహిళలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను వివరించారు. అనంతరం సఖీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఇంద్రమ్మదేవి, స్నేహ గ్రామైక్య సంఘాల సభ్యులు, సామాజిక కార్యకర్త ఎం.నిర్మల, ఐకేపీ సీసీ దేవేంద్ర, ఐలయ్య, స్కూల్ ఇన్చార్జి రావుల భాస్కర్‌రావు పాల్గొన్నారు.