పాలకుర్తి రూరల్, జూన్ 10: పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం లభిస్తున్నదని, ఇందుకనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లంపల్లిలో సద్గురు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సలువోజు చంద్రమౌళి దంపతులు నిర్మించిన సద్గురు సేవా సత్సంగ్ మందిరం కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో యాదాద్రి ఆలయ దేదిప్యమానంగా వెలుగొందుతుందన్నారు. ఆలయాలతో పాటు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి గ్రామం సంస్కృతి సంప్రదాయాలతో పరిఢవిల్లాలన్నారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మికతోనే మానసిక ప్రశాంతత లభిస్త్తుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. మల్లంపల్లిలో సెలువోజు చంద్రమౌళి చేస్తున్న కృషి అభినందనీయమని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
తన నియోజకవర్గ నిధులనుంచి మందిరానికి రూ.10 లక్షల నిధులు మంజూరు చేశానన్నారు. ప్రతిఒక్కరూ మానవత్వంతో స్పందించాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. గ్రామాల్లో చేపట్టే సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సెలువోజు చంద్రమౌళి, జీసీసీ మాజీ చైర్మన్ దరావత్ గాంధీనాయక్, దాత గోనె విద్యాసాగర్, సర్పంచ్ గిరగాని హేమలత కుమార్, ఎంపీటీసీ గుగులోత్ వసంత జుమ్మిలాల్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌కుమార్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ వెనుకదాసుల రాంచంద్రయ్య శర్మ, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, కాంట్రాక్టర్ వీరమనేని సోమేశ్వర్రావు, సంపత్ శ్రీపాల్‌రెడ్డి, గుగులోత్ దేవానాయక్, గర్వందుల వీరస్వామి, రామగిరి దామోదర్, గర్వందుల మల్లేశ్, పోశాల వెంకన్న, పవన్, తంగెళ్ల పల్లి యాకయ్య, చింతం వెంకన్న, పుర్మ రఘుపాల్, అంకిరెడ్డి శ్రీనివాస్, మాడిశెట్టి శ్రీనివాస్