దుగ్గొండి, నవంబర్ 20: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని నాచినపల్లి పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రావు అన్నారు. గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు సెంటర్లకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో మోడెం విశ్వశాంతి, నాచినపల్లి ఉపసర్పంచ్ జంగా రాజిరెడ్డి, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ గుడిపెల్లి ధర్మారెడ్డి, మామిండ్ల వేణుకుమార్, పీఏసీఎస్ డైరెక్టర్లు శ్యామ్‌సుందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
అన్నదాత శ్రేయస్సే లక్ష్యంగా..
పర్వతగిరి: అన్నదాత శ్రేయస్సే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్ అన్నారు. మండలంలోని జమాల్‌పురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులకు మేలు చేసేలా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. చౌటపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో తూర్పుతండా, గుగులోత్తండా, మూడెత్తులతండా, కొంకపాక, గోపనపెల్లి, జమాల్‌పురంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి మధుసూదన్‌రావు, డైరెక్టర్లు అమృతరావు, రంగయ్య, సర్పంచ్‌లు పిడుగు రేణుక, సాయిలు, పంజా మహేశ్, ఎంపీటీసీలు కర్మిళ్ల మోహన్‌రావు, సూర రమేశ్, సీఈవో వెంకటయ్య, ఉపసర్పంచ్లు సూర అశోక్, కొల్లూరి రవి, గోదారి నర్సయ్య, వీరన్న, చల్ల వెంకన్న, బూర శ్యామ్, జిల్లా అనిల్ పాల్గొన్నారు.