రఘునాథపల్లి/ఏటూరునాగారం, జూన్ 5 : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఆదివారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్పాట్లోనే మృతిచెందగా మరికొందరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా 36వ డివిజన్ పరిధిలోని చింతల్‌కు చెందిన తొమ్మిదిమంది హైదరాబాద్‌లో తమ బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి తవేరా వాహనంలో వెళ్తున్నారు. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా కు సమీపంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వాహనం టైర్ పేలి అదుపు తప్పి బోల్తాపడింది ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన షౌకత్ హు స్సేన్ (63), ఫర్జానబేగం (60), ఆఫ్రిన్ బేగం (40) స్పాట్లోనే మృతిచెందారు. తవేరా సుమారు 20 మీటర్ల దూరం నుంచి పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడడంతో, అందులో ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడడంతో భయానక వాతావరణం ఏర్పడింది.
ఈ ఘటనలో వాహనంలో ఉన్న రాహన్బేగం, హయత్ అలీకి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. మిగిలిన వారికి స్వల్ప గా యాలయ్యాయి. విషయం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్ పంకజ్, జనగామ రూరల్ సీఐ వినయ్‌కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సై శ్రవణ్‌కుమార్, లింగాలఘనపురం సీఐ రఘుపతి, సిబ్బంది రాజు, నవీన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులు వరంగల్ జిల్లా చింతల్‌కు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారితో పాటు మృతదేహాలను జనగామ వైద్యశాలకు తరలించారు. ట్రాఫిక్ అంతరాయం కలు గకుండా చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఇసుక లారీ, స్కార్పి యో ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ములుగు మండలం జాకారం గ్రామాని కి చెందిన వల్లాల కిష్టయ్య(45), గోవిందరావుపేట మండలం సోమలగడ్డకు చెందిన కమ్మం సాంబశివరాజు(17) అక్కడికక్కడే మృతి చెందగా, రాజేందర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నా యి. వల్లాల కిష్టయ్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో తునికాకు సేకరణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆకు సేకరణ పూర్తి కావడంతో స్కార్పియో వాహనంలో సాంబశివరాజుతో కలిసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. కాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన లారీ రాంపూర్ ఇసుక క్వారీ వద్దకు ఇసుక లోడింగ్‌కు వెళ్తోంది.
ఈ క్రమంలో ఏటూరునాగారంలోని జాతీయ రహదారి సమీపంలో ఎదురెదురుగా ఢీ కొనడంతో స్కార్పియోలో ఉన్న వ ల్లాల కిష్టయ్య, సాంబశివరాజు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, వీరితో పాటు వంట చేసేందుకు వెళ్లిన గణపురం మండలం నగరంపల్లికి చెందిన ముసలి రా జేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే మండల కేం ద్రంలోని సామాజిక వైద్యశాలకు తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ తరలించారు. కాగా, మృతుడు కిష్టయ్యకు భార్య సుజాత, ఇద్దరు పిల్ల లు ఉన్నారు. సాంబశివరాజు తండ్రి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నా డు. తునికాకు కాంట్రాక్టర్ వల్లాల కిష్టయ్యతో పరిచయం ఉండడంతో సాంబశివరాజు అతడి వెంట వెళ్లి వస్తున్నాడు. ఘటనా స్థలానికి సీఐ కిరణ్‌కుమార్, ఎస్సై రమేశ్ చేరుకుని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. స్థానిక సామాజిక వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి స్వగ్రామాలను తరలించినట్లు సీఐ కిరణ్‌కుమార్ తెలిపారు. లారీ డ్రైవర్ బీ రాజేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ..
వరంగల్ చౌరస్తా : రోడ్డు ప్రమాదంలో 36వ డివిజన్ పరిధిలోని చింతల్ ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మృతు ల కుటుంబాలను పరామర్శించారు. బాధితులను ప్ర భుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ మసూద్ ఉన్నారు.