నర్సంపేట రూరల్, జూన్ 5 : జిల్లాలోని అన్ని గ్రామాలు హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు అన్నారు. ఆదివారం మండలంలోని లక్నేపల్లి, మహేశ్వరం గ్రామాల్లోని నర్సరీలు, పారిశుధ్య పనులు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులను పరిశీలించారు. అధికారులు, ఉపాధి హామీ సిబ్బందికి మొక్కల పెంపకంపై పలు సూచనలు చేశారు. అనంతరం లక్నేపల్లి గ్రామంలోని పీవీ మెమోరియల్ ట్రస్టును సందర్శించారు. పీవీ కాంస్య విగ్రహానికి పూలమాల వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమానికి కావాల్సిన మొక్కలను సిద్ధం చేయాలన్నారు. ఇప్పటి నుంచే ప్రజలకు కావాల్సిన మొక్కల వివరాలను సేకరించాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, డీఎల్పీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, సర్పంచ్‌లు గొడిశాల రాంబాబు, మాడ్గుల కవిత, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, ప్రత్యేకాధికారులు కృష్ణకుమార్, భాస్కర్, కార్యదర్శులు కూతురు అనితారెడ్డి, మహాలక్ష్మి, కల్పన తదితరులు ఉన్నారు.
నిర్లక్ష్యం వద్దు..
గీసుగొండ : అభివృద్ధిలో మరియపురంతో మి గతా గ్రామాలు పోటీ పడాలని పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు అన్నారు. మండలంలోని కోనాయిమాకుల, మరియపురం గ్రామా ల్లో పర్యటించారు. నర్సరీ, విలేజ్ పార్కుతో పా టు క్రీడా ప్రాంగణాలకు కేటాయించిన స్థలాలు, డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికలను పరిశీలించారు. మరియపురంలో వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ విధానం చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీడీవో, మండలస్థాయి అధికారులు తరచుగా గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో మిగతా గ్రామాలు అభివృద్ధిలో వెనకబడి ఉన్నాయన్నారు. ప్రతి గ్రా మంలో నర్సరీలు, పార్కులు, పారిశుధ్య నిర్వహ ణ బాధ్యత అధికారులదేనన్నారు. పల్లెప్రగతిలో కొన్ని గ్రామాలు అభివృద్ధి సాధించాయని, మిగ తా గ్రామాలు ఎందుకు లక్ష్యం చేరుకోలేదో అధికారులు నివేదిక పంపాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, డీఎల్పీవో ప్రభాకర్, ఎంపీపీ భీమగాని సౌజన్య, మరియపురం, కోనాయిమాకుల సర్పంచ్‌లు అల్లం బాలిరెడ్డి, డోలి రాధాబాయి, ఎంపీవో ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.