పర్వతగిరి, జూన్ 5 : సీఎం కేసీఆర్ పనితనం వల్లే రాష్ర్టానికి జాతీయ స్థాయి అవార్డులు వస్తున్నాయని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి రాజారావుతో కలిసి జడ్పీ చైర్పర్సన్ మండలంలోని అనంతారం, గోపనపల్లి, తూర్పు తండా గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా అనంతారం జీపీ పల్లె ప్రకృతి వనంలోని పూలతో తయారు చేసిన బొకేను చైర్పర్సన్, సీఈవోకి సిబ్బంది అందించారు. అనంతరం డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలోని ఓపెన్ జిమ్‌ను పరిశీలించారు. అనంతరం జీపీ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపు రేఖలు మారాయని, జాతీయ స్థాయిలో 20 ఉత్తమ గ్రామ పంచాయతీల్లో 19 తెలంగాణలో ఉండడం సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమన్నారు. అనంతారం జీపీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సర్పంచ్ తౌటి దేవేందర్ కోరారు. అనంతరం గోపనపల్లి, తూర్పు తండాలోని నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, జీపీ హెల్త్ సెంటర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల పంతులు, జడ్పీటీసీ సింగ్‌లాల్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో సుశీల్ కుమార్, సర్పంచ్‌లు తౌటి దేవేందర్, మహేశ్, బానోత్ విజయ, ఎంపీటీసీలు సూర రమేశ్, భూక్యా భాస్కర్, జీపీ కార్యదర్శులు సుమన్, సదానందం, రమాదేవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.