ఖిలావరంగల్/వరంగల్‌చౌరస్తా/గిర్మాజీపేట, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలతో గురువారం నగరం మురిసింది. వరంగల్ వ్యాప్తంగా సంబురాలు మిన్నింటాయి. ఇందులో భాగంగా వరంగల్ 34వ డివిజన్లో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు, ఉద్యమకారుడు పగడాల సతీశ్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, టీఆర్ఎస్వీ నగర కార్యదర్శి కలకొండ అభినాశ్, తిరుపతి పాల్గొన్నారు. 37వ డివిజన్లోని తూర్పుకోట, పడమర కోటలో కార్పొరేటర్ బోగి సువర్ణ, పార్టీ డివిజన్ అధ్యక్షుడు సంగరబోయిన విజయ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే, కలెక్టరేట్లో జాతీయ జెండాను కలెక్టర్ గోపి ఆవిష్కరించారు.
అదనపు కలెక్టర్లు బీ హరిసింగ్, శ్రీవత్స కోట, ఆర్డీవో మహేందర్‌జీ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీవో ఆఫ్రిన్ సిద్ధికీ, వరంగల్ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సీహెచ్ పరశురాములు జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే, వరంగల్ ఎంజీఎం, కేఎంసీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆవరణలో వీసీ డాక్టర్ బీ కరుణాకర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్, ఏడీ నాగార్జున పాల్గొన్నారు. ఎంజీఎం ఆవరణలోని గాంధీజీ విగ్రహం వద్ద సూపరింటెండెంట్ డాక్టర్ వీ చంద్రశేఖర్, ఆర్ఎంవో డాక్టర్ మురళి, అడిషనల్ ఆర్ఎంవో డాక్టర్ ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌రావు, సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్లో నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్‌రావు, ఎంజీఎం క్షయవ్యాధి నివారణ కేంద్రంలో యూనిట్ టీబీ కంట్రోలర్ డాక్టర్ మల్లికార్జున్, ఐఎంఏ ఆవరణలో అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగార్జునరెడ్డి, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. డీఈవో కార్యాలయంలో డీఈవో వాసంతి, ఇంతేజార్గంజ్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మల్లేశ్‌యాదవ్, 33వ డివిజన్లో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ జెండాలను ఆవిష్కరించారు. 28వ డివిజన్ హంటర్‌రోడ్డులో కార్పొరేటర్ గందె కల్పనానవీన్, 25వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజు శిరీషాశ్రీమాన్, 26వ డివిజన్లో కార్పొరేటర్ బాలిన సురేశ్ ఆధ్వర్యంలో, వరంగల్చౌరస్తాలో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు యువసేన ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
పోచమ్మమైదాన్/కరీమాబాద్/కాశీబుగ్గ: వరంగల్ నగరంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ప్రజలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా పాల్గొన్నారు. 21వ డివిజన్ నర్సంపేటరోడ్డులో కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్, ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్‌బౌళి ఉన్నత పాఠశాలలో హెచ్ఎం టీ కవిత, తిలక్‌రోడ్డులో మహిళా సంఘం అధ్యక్షురాలు ముష్కె ప్రమీల, 22వ డివిజన్లో పోచమ్మమైదాన్ 80 ఫీట్లరోడ్డు ప్రాంతంలో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, దేశాయిపేటరోడ్డులో టీఆర్ఎస్ నాయకుడు మావురపు గీత విజయభాస్కర్‌రెడ్డి, 23వ డివిజన్లోని అమరవీరుల స్తూపం వద్ద మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతీ సత్యనారాయణ, నీలం రాజ్‌కిశోర్, 12వ డివిజన్లో కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్, దేశాయిపేటలోని ప్రభుత్వ సహాయక నెహ్రూ మెమోరియల్ స్కూల్లో హెచ్ఎం వద్దిరాజు వెంకటేశ్వర్లు జెండాలను ఆవిష్కరించారు. కరీమాబాద్ పరిధిలోని 32, 39, 40, 41, 42, 43 డివిజన్లలో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, ఈదురు అరుణ త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు.
రంగశాయిపేటలో పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్ ఉద్యమకారులను సత్కరించారు. 32వ డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్ జెండా ఎగురవేశారు. 41వ డివిజన్లో ఈదుల రమేశ్, 40వ డివిజన్లో పూజారి విజయ్ గులాబీ జెండాలు ఆవిష్కరించారు. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి పీఏసీఎస్‌లో నిర్వహించిన వేడుకల్లో చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను షీభారాణి-అనిల్, వైస్ చైర్మన్ కంకాల సదానందం, డైరెక్టర్లు కే భిక్షపతి, జన్ను స్వామిదాసు, జూలూరి శ్రీనివాస్, నేరెళ్ల రాజేందర్, జన్ను ఉల్లాస, టీఆర్ఎస్ నాయకులు, ఇన్చార్జి సీఈవో శ్రీకాంత్ పాల్గొన్నారు.
19, 20వ డివిజన్లలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, ఓని స్వర్ణలత, 14వ డివిజన్ సుందరయ్యనగర్‌లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జంగం రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. లక్ష్మీపురంలోని చాంబర్ కార్యాలయంలో అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. లేబర్‌కాలనీలో జైభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ను ఎగురవేశారు. అధ్యక్షుడు అరుణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కొడిమల్ల అభిలాశ్ పాల్గొన్నారు. తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హమాలీలకు యూనిఫాం పంపిణీ చేశారు.