నర్సంపేట/ఖానాపురం/సంగెం/దుగ్గొండి/నెక్కొండ, జూన్ 2: నర్సంపేటలో స్వచ్ఛంద, యువజన, మహిళా సంఘాలు, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం, చాకలి ఐలమ్మ, తెలంగాణతల్లి, అంబేద్కర్ విగ్రహాలు, విద్యుత్ స్తంభాలను రంగురంగుల విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ జెండాను ఎగురవేశారు. ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ సంపత్‌రావు, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో పవన్‌కుమార్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏ శ్రీనివాసరావు జెండాలను ఎగురవేశారు. టీఆర్ఎస్ నాయకులు తెలంగాణతల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అలాగే, పట్టణంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కమ్మల సోములు, పిట్టల సతీశ్, ఉర్సు అశోక్, బల్ల సందీప్ పాలక మహేశ్, సాంబరాజు ఉన్నారు.
ఖానాపురం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ జూలూరు సుభాషిణి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై తిరుపతి, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం సుధాకర్, పీహెచ్సీలో డాక్టర్ మల్యాల అరుణ్‌కుమార్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సంగెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కళావతి, తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ రాజేంద్రనాద్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై కిరణ్మయి, మండలకేంద్రంలోని జీపీలో సర్పంచ్ బాబు, మండల పశువైద్యాధికారి కార్యాలయంలో డాక్టర్ వీ రాజు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో యాకయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీకాంత్‌రెడ్డి, జీపీల్లో సర్పంచ్‌లు, విద్యా సంస్థల్లో హెచ్ఎంలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీవో ఎన్ మల్లేశం, వైస్ ఎంపీపీ మల్లయ్య, ఎంపీవో కొమురయ్య, ఎంపీటీసీలు మల్లయ్య, నర్సింహస్వామి, సుమలత, పద్మ, కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, ఉపసర్పంచ్ కక్కెర్ల శరత్ పాల్గొన్నారు.
దుగ్గొండి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎంపీడీవో కృష్ణప్రసాద్, తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ సంపత్‌కుమార్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై నవీన్‌కుమార్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో దయాకర్, పీఏసీఎస్‌ల్లో చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, పైడి, గుడిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏఈలు సురేశ్, శ్రీధర్, ఎంఎస్ కార్యాలయంలో అధ్యక్షురాలు సాంబలక్ష్మి, ఏపీఎం రాజ్‌కుమార్, పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు రాజు, స్వప్న, పశువైద్యశాలల్లో డాక్టర్లు రామ్మోహన్, శారద, బాలాజీ, టీఆర్ఎస్ కార్యాలయంలో మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు ఎర్రల్ల బాబు, బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు చుక్కా రమేశ్ జాతీయ జెండాలు ఎగురవేశారు.
నెక్కొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, పీఏసీఎస్ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ మారం రాము, తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ డీఎస్ వెంకన్న, నెక్కొండ జీపీలో సర్పంచ్ సొంటిరెడ్డి యమునా రంజిత్‌రెడ్డి, బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నెక్కొండ-నర్సంపేట క్రాస్‌రోడ్డులో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్కి అశోక్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో సుగుణకుమార్, డీటీ రాజ్‌కుమార్, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, సీఈవో మోడెం సురేశ్, సొసైటీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, గరికపాటి కృష్ణారావు, ఈదునూరి యాకయ్య, వెంకన్న, భద్రయ్య, కే సురేశ్ పాల్గొన్నారు.
ఎగిరిన జాతీయ పతాకం..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాడవాడలా జాతీయ పతాకం ఎగిరింది. గీసుగొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సౌజన్య, తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ సుహాసిని, పీహెచ్సీ, పోలీస్‌ష్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని 21 గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సుహాసిని మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు సుఖాసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సాధించుకొని ఎనిమిదేళ్లు పూర్తయినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. వరంగల్ 15, 16వ డివిజన్లలో కార్పొరేటర్లు ఆకుల మనోహర్, సుంకరి మనీషా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ప్రబాకర్, ఎంపీటీసీలు హనుము, గోపాల్, భిక్షపతి, రజిత, కొమాల, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
చెన్నారావుపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బానోత్ విజేందర్, తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ బన్సీలాల్, పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ జన్ను స్వామి, పీఏసీఎస్‌లో డైరెక్టర్ జంగిలి రాజు, పీహెచ్సీలో మండల వైద్యాధికారి ఉషారాణి, చెన్నారావుపేట జీపీలో సర్పంచ్ కుండె మల్లయ్య, టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, గ్రామాల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నాయకులు తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఘటనలను గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
నర్సంపేట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మోతె కళావతి, తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ వాసం రామ్మూర్తి, ఆదర్శ మండల సమాఖ్యలో అధ్యక్షురాలు మోటూరి శ్వేత, భాంజీపేట పీహెచ్సీలో వైద్యాధికారి భూపేశ్, మహేశ్వరం పట్టణ బాలుర గురుకుల విద్యాలయంలో ప్రత్యేక అధికారి మహ్మద్ ఇసాక్ అలీ, భాంజీపేట పశువైద్యశాలలో డాక్టర్ శ్రీధర్‌వర్మ, మహేశ్వరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏఈ నవీన్‌కుమార్, నర్సంపేట, గురిజాల పీఏసీఎస్‌ల్లో ఆయా సొసైటీ చైర్మన్లు మోహన్‌రెడ్డి, రమేశ్‌గౌడ్ జాతీయ జెండాలను ఎగురవేశారు. తొలుత తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేని నివాళులర్పించారు. అలాగే, అన్ని గ్రామాల్లోని జీపీ కార్యాలయాల ఆవరణలో సర్పంచ్‌లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
నల్లబెల్లిలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షుడు బానోత్ సారంగపాణి, తహసీల్ కార్యాలయంతో తాసిల్దార్ దూలం మంజుల, పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సై వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, పీఏసీఎస్‌లో చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, రైతు వేదికలో ఏవో పరమేశ్వర్, గ్రామాల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గందె శ్రీలతాశ్రీనివాస్, నాయకులు పాలెపు రాజేశ్వర్‌రావు, కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ గోనెల పద్మనరహరి, సర్పంచ్‌లు, నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పర్వతగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కమలా పంతులు, గ్రామాల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఎంపీడీవో సంతోష్‌కుమార్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమార్‌గౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, ఎంపీటీసీ రాజు, సర్పంచ్ మాలతీ సోమేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. రాయపర్తి తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ సత్యనారా యణ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అనిమిరెడ్డి, తెలం గాణ అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహానాయక్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రాజు, రైతు వేదికలో ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ సురేందర్‌రావు, రాయపర్తి జీపీలో సర్పంచ్ గారె నర్సయ్య జెండా ఎగురవేశారు.