ఐనవోలు, మే 23 : నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని, ఈమేరకు ప్ర భుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవా రం మండలంలోని పున్నేలు ప్రాథమిక పాఠశాలలో మన ఊరు- మన బడి కార్యక్రమం లో భాగంగా రూ.54.50లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అలాగే, మండల వ్యాప్తంగా తొమ్మిది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 కోట్ల12లక్షలు ఖ ర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దడానికి కృషి చే స్తున్నదన్నారు. నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ‘మన ఊరు-మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల అభివృద్ధికి రూ.68 కోట్ల 78 లక్షల నిధులు కేటాయించామన్నారు.
రైతుల పొట్టనింపే ప్రభుత్వం..
దేశంలో రైతుల సంక్షేమం కోసం పనిచేస్తు న్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ మేనన్నారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో రైతులను కొంత మంది రాజకీయ లబ్ధి కోసం గందరగోళానికి గురి చేస్తున్నారని, అన్నదాతల అనుమతి లేకుండా గుంట భూమి కూడా అధి కారులు తీసుకోరన్నారు. ఈ ప్రభుత్వం రైతు ల పొట్ట నింపే ప్రభుత్వమే.. కానీ రైతుల పొట్టకొట్టే ప్రభుత్వం కాదన్నారు. పున్నేలు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర గిరిజన నాయకుడు సారయ్య ఎమ్మెల్యేను సన్మానించారు.
త్వరగా పూర్తి చేయాలి..
మండల వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మె ల్యే అరూరి అధికారులను ఆదేశించారు. మం డల కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.33.50లక్షలతో సీసీ రోడ్లు, ఈజీఎస్ నిధులు రూ.78.30లక్షలతో పనులు కొనసాగనున్నట్లు తెలిపారు. కాగా, పలుచోట్ల మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీ అవుతున్నట్లు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మరమ్మతుల చేయడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారని మిషన్ భగీరథ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, మం డల కేంద్రానికి చెందిన కట్కూరి రాజు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ దవాఖానల్లో చికిత్స పొందగా, సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2 లక్షల20వేల చెక్కును ఎమ్మెల్యే లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అందజేశారు.
ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినే టర్ మజ్జిగ జయపాల్, ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు మునిగాల సంపత్‌కుమార్, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పొల్లేపల్లి శంకర్‌రెడ్డి, బుర్ర రాజశేఖర్, సర్పంచ్‌లు ఫోరం అధ్యక్షుడు కత్తి దేవేందర్, సర్పంచ్ జన్ను కు మారస్వామి, ఎంపీటీసీలు కల్పన, అరుణ, మండల స్పెషలాఫీసర్ నాగేశ్వర్రావు, ఉప సర్పంచ్ సతీశ్, నాయకులు దేవికారెడ్డి, కోమలత, పరమేశ్, సమ్మయ్య, మహేందర్, సార య్య తదితరులు పాల్గొన్నారు.