నర్సంపేటరూరల్/దుగ్గొండి, మే 17: రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, మద్దతు ధర కల్పించేందుకే తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు అన్నారు. నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట, ఇటుకాలపల్లిలో నర్సంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని రైతులను కోరారు. ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 1960, కామన్ గ్రేడ్‌కు రూ. 1940 ధరను ప్రభుత్వం చెల్లిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గోలి శ్రీనివాస్‌రెడ్డి, మండల రవీందర్, ఎంపీటీసీ భూక్యా వీరన్న, ఉప సర్పంచ్‌లు పెదరాయుడు, జమాండ్ల చంద్రమౌళి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మేరుగు శ్రీనివాస్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ చాంద్‌పాషా, ఏఈవో నవీన్, డైరెక్టర్లు కోమాండ్ల రాజిరెడ్డి, దామెర రవి, మిట్టగడపల సుప్రజ, నాయకులు కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, రవి, రాజు, రమేశ్, వెంకన్న, సుధాకర్, నరేశ్ పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలోని తిమ్మంపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ సుకినె రాజేశ్వర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి ధాన్యం పండించిన అన్నదాతలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తిమ్మంపేట సర్పంచ్ మోడెం విద్యాసాగర్‌గౌడ్, నాచినపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ గుడిపెల్లి ధర్మారెడ్డి, నారాయణతండా సర్పంచ్ కొర్ర మధు, ఎంపీటీసీ మాలోత్ చంద్రునాయక్, డైరెక్టర్లు కోమాండ్ల సూరారెడ్డి, దోనపాటి జనార్దన్‌రెడ్డి, అజ్మీరా సాంబయ్య, నరహరి సునీత, ఎలకంటి కుమారస్వామి, నలగొండ మొగిలి, దోనపాటి సాంబారెడ్డి, సీఈవో ముల్క రాజయ్య, సోమ ఓంకార్, రజినీకుమార్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం నిర్వహణ భేష్
రాయపర్తి: రాగన్నగూడెంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కొనుగోలు కేంద్రం నిర్వహణ బాగుందని తాసిల్దార్ కుసుమ సత్యనారాయణ కితాబిచ్చారు. మంగళవారం ఆయన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ధాన్యం నిల్వలు, కాంటాల తీరుతెన్నులు, బస్తాల రవాణా, రికార్డులు, వసతులను ఆయన పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి జిల్లాలోని రెండు రైస్ మిల్లులకు ఆరు లారీల ధాన్యం బస్తాలను రవాణా చేయగా, నాలుగు లారీల లోడ్ ధాన్యానికి రైతులకు చెల్లింపులు జరిపినట్లు యానిమేటర్ సరికొండ నవల తాసిల్దార్‌కు వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, సీఏ నవల, హమాలీలను ఆయన అభినందించారు. ఆయన వెంట గిర్దావర్ కొయ్యాడ చంద్రమోహన్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.