నర్సంపేట, మే 3: క్రీడాకారులు మెళకువలు నేర్చుకొని ఆటలో రాణించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో మంగళవారం ఆయన కబడ్డీ, రెజ్లింగ్ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. మారుమూల క్రీడాకారులకు సైతం సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం స్టేడియం ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ప్రతి పాఠశాలకు పీఈటీని నియమించి విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తారన్నారు. నర్సంపేటలో గడచిన ఏడేళ్లలో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలను కూడా నిర్వహించినట్లు గుర్తుచేశారు. క్రీడాకారులు వేసవి శిబిరాల్లో పాల్గొని కోచ్‌ల సూచనలు, సలహాలు పాటించి మరింత రాణించాలని కోరారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లూరిస్వామిగౌడ్ మాట్లాడుతూ వేసవి శిబిరం నెల రోజులపాటు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జుర్రు రాజు, ఎస్సై రామ్‌చరణ్, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు శానబోయిన రాజ్‌కుమార్, యాదగిరి, సుధాకర్, మల్లికార్జున్, గూడెపు భిక్షపతి, గూడెపు రవీందర్, ఉడుత శ్రీకాంత్, దేవీలాల్, తాబేటి నాగరాజు, సుభద్ర, యాట రవికుమార్, సింగారపు మహేశ్, శేఖర్ పాల్గొన్నారు.
నర్సంపేటలో బసవేశ్వర జయంతి
నర్సంపేట/దుగ్గొండి: పట్టణంలో బసవేశ్వర 889వ జయంతిని వీరశైవ లింగాత్, వడబలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన బసవేశ్వర చిత్రపటానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాత్ వడ బలిజ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగే, ఎమ్మెల్యే పెద్ది దుగ్గొండి మండలం గిర్నిబావిలో పర్యటించారు. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముత్యాల ప్రతాప్‌రెడ్డి మృతి చెందగా, కార్యకర్తలతో కలిసి బాధిత కుటుంబాన్ని పెద్ది పరామర్శించారు. ముందుగా ప్రతాప్‌రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కాట్ల కోమలాభద్రనయ్య, టీఆర్ఎస్ గిర్నిబావి గ్రామ అధ్యక్షుడు గోళి రవి, చల్లా సంజీవరెడ్డి, నర్సిరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.