పర్వతగిరి, మే 3: రైతును రాజు చేయడమే ధ్యే యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని వర్ధన్నపే ట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అ రూరి రమేశ్ అన్నారు. మంగళవారం మండలం లోని మల్యా తండా, ఏనుగల్, చౌటపెల్లి గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చా లనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నా రు. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరంటు అందించడంతోపాటు రుణ మాఫీ, రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికల నిర్మాణం, ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఏఈవో ల నియామకం వంటి అనేక రైతు సంక్షేమ పథ కాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని రెండు పంటలకు సాగు నీరందించా లనే సంకల్పంతో కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టు లను త్వరితగతిన పూర్తి చేశారని పేర్కొన్నారు.
రైతాంగానికి ఇబ్బందులు రాకుండా పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. అనంతరం పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్ ఆధ్వర్యంలో గజమాలతో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ను సన్మానించారు. హట్యతండాలో దుర్గమ్మ తల్లి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. మృతుడి కుటుం బాన్ని పరామ ర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలా పంతులు, జడ్పీటీసీ సింగ్‌లాల్, పీఏసీఎ స్ చైర్మన్ మనోజ్‌కుమార్, మార్కెట్ డైరెక్టర్ పట్ట పురం ఏకాంతంగౌడ్, డీఆర్డీఏ పీడీ సంపత్ రావు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, ఏపీ ఎం కృష్ణమూర్తి, సీసీలు సుధాకర్, రవీందర్‌రాజు, సర్పంచులు సుజాతాఈర్యానాయక్, సంధ్యారా ణీనర్సింగం, ఉమారాజు, ఎంపీటీసీలు భాస్కర్, కోల మల్లయ్య, లావణ్య, మోహన్‌రావు, సీఐ విశ్వేశ్వర్, ఎస్ఐ కే కిషోర్, మండల అధ్యక్షుడు కుమార్‌గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి మధుసూదన్‌రావు, భాస్కర్‌రావు, డీసీవో సంజీ వరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యుగేంధర్ రావు, సర్వర్, గూడ నరేందర్వర్మ, చిన్నపాక శ్రీని వాస్, మాధవరావు, గోపాల్‌రావు, బొట్ల మధు తదితరులు పాల్గొన్నారు.