ఖిలావరంగల్, ఏప్రిల్ 24: పేదింటి ఆడబిడ్డల పెళ్లికి వరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా లు అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం శివనగర్‌లోని సాయికన్వెన్షన్ హాలులో ఖిలావరంగల్ మండలానికి చెందిన 193 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి భారం కాకుండా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్ మసూద్, ఖిలావరంగల్ మండలంలోని కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్లో..
కాశీబుగ్గ: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందిస్తుందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 13వ డివిజన్లోని ఎల్బీనగర్ షాదీఖానా ఉర్దూ భవనంలో కార్పొరేటర్ సురేష్‌జోషి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. 167 మంది లబ్ధిదారులకు రూ.16లక్షల 719వేల 372 చెక్కులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, కావటి కవితారాజు యాదవ్, ఫుర్కాన్, బాబు, నాయకులు ముష్కే ప్రమీల, మావూరపు విజయభాస్కర్‌రెడ్డి, యెలగం సత్యనారాయణ, ఎండీ యాకుబ్‌పాషా, ఓని భాస్కర్ పాల్గొన్నారు.
లబ్ధిదారుల సంబురం
కల్యాణలక్ష్మి చెక్కు చేతికి రావడంతో లబ్ధిదారులు సంబురపడుతున్నారు. వెంటనే తమ బంధువులకు, అప్పుదారులకు ఫోన్‌చేసి తొందర్లోనే అప్పు తీర్చుతామని తెలుపుతున్నారు. స్వరూప అనే మహిళ తన అల్లుడికి ఫోన్ చేసి చెక్కు క్లియర్ కాగానే బైకు కొనిస్తానని చెప్పింది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొంది. పెద్దన్నలా కేసీఆర్ ఆదుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది.