నర్సంపేట, ఏప్రిల్ 24: ముస్లిం ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలో నిరుపేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల పండుగలను గౌరవిస్తున్నారని తెలిపారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల ప్రధాన పండుగలకు కానుకలను అందిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ వర్తించేలా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఆర్డీఓ పవన్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, కమిషనర్ గొడిశాల రవీందర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ రామ్మూర్తి, కౌన్సిలర్లు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
నెక్కొండ షాదీఖాన, మసీదులఅభివృద్ధికి రూ.10లక్షలు : ఎమ్మెల్యే పెద్ది
నెక్కొండ: మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం మైనార్టీ కుటుంబాలకు అందిస్తున్న రంజాన్ కానుకలను ఆదివారం నెక్కొండలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెక్కొండలో షాదీఖానా ప్రహరీ నిర్మాణానికి, మసీదు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పీపీ అబ్దుల్‌నబి, సొసైటీ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, సర్పంచ్ సొంటిరెడ్డి యమున రంజిత్‌రెడ్డి, హుస్సై సీమఫర్హీన్, సీనియర్ నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, మాదాసు రవి, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, సర్పంచ్ సొంటిరెడ్డి యమునా రంజిత్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, మసీదు కమిటీ చైర్మన్ మహ్మద్ హమీద్, మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ అమీర్, ఈదునూరి యాకయ్య, వాగ్యానాయక్ పాల్గొన్నారు. కాగా, నెక్కొండ ఎంపీపీ జాటోత్ రమేశ్ కూతురు చిక్కి పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, స్వప్న దంపతులు హాజరై ఆశీర్వదించారు. జడ్పీటీసీ లావుడ్య సరోజనా హరికిషన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, సొసైటీ చైర్మన్ మారం రాము, గుండ్రపల్లి సర్పంచ్ బోంపెల్లి రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ లింగాల అజయ్, నెక్కొండ ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, చల్లా చెన్నకేశవరెడ్ది, రాజిరెడ్డి పాల్గొన్నారు.