నర్సంపేట/వర్ధన్నపేట, ఏప్రిల్ 8: ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ నర్సంపేటలో ఇంటింటా నల్లజెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు. పట్టణంలో రోడ్లపై నల్ల జెండాలు ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటి రజినీకిషన్, పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నాయకులు పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో నల్లజెండాలు ఎగురవేశారు. పాపయ్యపేటలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి ర్యాలీ నిర్వహించారు. జడ్పీటీసీ పత్తినాయక్, సర్పంచ్ ఉప్పరి లక్ష్మీవెంకన్న, సొసైటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ బుర్రి తిరుపతి, ఎంపీటీసీ మొగిలి రమాకేశవరెడ్డి, కంది కృష్ణచైతన్యారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్లో జాతీయ రహదారిపై టీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఇండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద నల్లజెండాలు ఎగురవేశారు. పట్టణంలో పార్టీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధాన్యం కొనే వరకూ పోరాడుతాం
కేంద్రప్రభుత్వం ధాన్యం కొనే వరకూ పోరాడుతామని టీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి. తెలంగాణ రైతాంగంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సంగెం మండలంలోని అన్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం, మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. గవిచర్ల, తీగరాజుపల్లి, పల్లార్గూడలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, సర్పంచ్‌లు దొనికెల రమ, కర్జుగుత్త రమ, కక్కెర్ల కుమారస్వామి, పోతుల ప్రభాకర్, కిశోర్‌యాదవ్, మంగ్యానాయక్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఖానాపురం మండలంలో ఇంటింటా నల్లజెండాలు ఎగురవేశారు. అశోక్‌నగర్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బుధరావుపేటలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, నాయకులు పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇప్పల్‌తండాలో ప్రజలు, రైతులు ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేశారు. గురిజాలలో సర్పంచ్ గొడిశాల మమత, ఎంపీటీసీ బండారి శ్రీలత-రమేశ్, న్యాయవాది మోటూరి రవి ఆధ్వర్యంలో రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. కమ్మపల్లిలో సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు మిట్టగడపల మల్లయ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భోజ్యానాయక్తండాలో సర్పంచ్ భూక్యా లలిత, పార్టీ మండల నాయకుడు భూక్యా వీరన్న ఆధ్వర్యంలో, గుంటూరుపల్లిలో బుర్రి సాంబలక్ష్మి, నర్సింహారావు ఆధ్వర్యంలో, పాతముగ్ధుంపురంలో సర్పంచ్ సుంకరి లావణ్య-సాంబయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బషీర్ ఆధ్వర్యంలో నల్లా జెండాలతో నిరసన తెలిపారు. భోజ్యానాయక్‌తండా, లక్నేపల్లిలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గందె శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ ధాన్యాన్ని కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో నల్ల జెండాలు ఎగురవేశారు. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అబ్బు జైపాల్‌రెడ్డి, సర్పంచ్ కవితా విజేందర్‌రెడ్డి, రాజు, రవి, దేవనాయక్, వినయ్, రైతులు మొగిలి, భరత్, మల్లారెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర
ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ నేతృత్వంలో రాయపర్తిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్రను డప్పుచప్పుళ్ల మధ్య నిర్వహించారు. అనంతరం దింపుడు కళ్లం చేసి దహన సంస్కారాలు చేపట్టారు. ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, పూస మధు, ఎండీ నయీం, ఉండాడి సతీష్‌కుమార్, సర్పంచ్‌లు గారె నర్సయ్య, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, చిన్నాల రాజబాబు, భూక్యా భద్రూనాయక్ తదితరులు పాల్గొన్నారు. నెక్కొండ మండలం చంద్రుగొండలో రైతన్నలు, మహిళలు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. మహిళలు వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ సిలిండర్లతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బక్కి రాజమ్మ-సాంబయ్య, ఉప సర్పంచ్ ఎర్ర సతీశ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సిరిపోతుల సురేశ్, నాయకులు పాల్గొన్నారు. మామునూరులో టీఆర్ఎస్ నాయకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు.
అనంతరం ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేశారు. ఎం రాణి, జమీరొద్దీన్ పాల్గొన్నారు. వరంగల్ 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల మనోహర్, టీఆర్ఎస్ గీసుగొండ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఇండ్లపై నల్లాజెండా ప్రదర్శన, గీసుగొండలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, టీఆర్ఎస్ నాయకులు సుంకరి శివ, గోలి రాజయ్య, బెజ్జల వెంకటేశ్వర్లు, గజ్జి రాజు, రమేశ్, వేణు, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు బాబు, అనిల్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ 37వ డివిజన్ తూర్పుకోటలో నల్లజెండాలతో నిరసన తెలిపారు.
కార్పొరేటర్ బోగి సువర్ణా సురేశ్, మాజీ కార్పొరేటర్ బిల్లా కవితా శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. పర్వతగిరి చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, ఎంపీటీసీ మాడ్గుల రాజు తదితరులు పాల్గొన్నారు. జమాల్‌పురంలో నల్లజెండాలు ఎగురవేసి, మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తురుకల సోమారంలో సర్పంచ్ రాపాక రేణుకా నాగయ్య, గోరుగుట్టతండా సర్పంచ్ వెంకన్ననాయక్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పార్టీ గ్రామ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఏబీతండా, వడ్లకొండ, చింతనెక్కొండలో ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. దుగ్గొండి మండలంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో రైతులు, నాయకులు నిరసన ప్రదన్శనలు నిర్వహించారు. ఇంటింటా నల్లజెండాలు ఎగురవేశారు. కార్యక్రమంలో కాట్ల కోమలాభద్రయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ తోకల నర్సింహారెడ్డి, గుండెకారి రంగారావు, ఊరటి రవి, పల్లాటి కేశవరెడ్డి, బూరుగు భిక్షపతి, కామిశెట్టి ప్రశాంత్, శోభన్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
వడ్లు కొనేదాకా ఉద్యమిస్తాం
కాశీబుగ్గ: వడ్లు కొనేదాకా ఉద్యమిస్తామని వరంగల్ 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను షీభారాణి-అనిల్, పీఏసీఎస్‌ల చైర్మన్ల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారి, హనుమకొండ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ హెచ్చరించారు. పైడిపల్లిలో ప్రతి ఇంటిపై నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ నాయకులు పండుగ రవీందర్‌రెడ్డి, లింగం కోటిలింగం, మంతుర్తి కుమార్, ఇట్యాల సతీశ్, నేరెళ్ల రాజు, బొల్లం విజయ్, నామసాని నాగరాజు, సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు. 14వ డివిజన్ ఎస్ఆర్నగర్లో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పసులాది మల్లయ్య ఆధ్వర్యంలో నల్లజెండాలు ప్రదర్శించగా, నాయకులు ముడుసు నరసింహ, కేతిరి రాజశేఖర్, మచ్చర్ల స్టాలిన్, గూడూరు కృష్ణ పాల్గొన్నారు. ఎన్టీఆర్నగర్లో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి యాదగిరి, పిట్ట నగేశ్, కట్ల నాగరాజు, పొడిశెట్టి అశోక్‌చారి, నీరటి సురేశ్, ల్యాగల భిక్షపతి, కస్తూరి భరత్, బొజ్జ కిరణ్ పాల్గొన్నారు.