పరకాల/నడికూడ/దామెర, ఏప్రిల్ 3 : రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఇన్చార్జిలు స్వీకరిస్తున్నారు. కాగా, పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు శాతరాసి సనత్, మొలుగూరి శ్రీనివాస్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అలాగే, టీఆర్ఎస్ నడికూడ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి ఆధ్వర్యంలో కూడా స్థానిక నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఊర రవీందర్ రావు, ఎంపీపీ మచ్చ అనసూర్యా రవీందర్, జడ్పీటీసీ కోడెపాక సుమలత, పార్టీ మండల కార్యదర్శి నందికొండ గణపతిరెడ్డి, వైస్ ఎంపీపీ చంద కుమారస్వామి, మాదారం పీఏసీఎస్ చైర్మన్ నల్లెల లింగమూర్తి, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, సమన్వయ కమిటీ సభ్యులు భీమిడి నాగిరెడ్డి, నందికొండ జైపాల్‌రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు నారగాని శ్రీనివాస్, కార్యదర్శి రావుల కిషన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ముస్కె రాము, జిల్లా కోఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి, మండల యూత్ అధ్యక్షుడు బొల్లారం అనిల్, కార్యదర్శి సురబు శ్రీకాంత్, గుడికందుల శివ, మధుకర్, నార్లాపూర్ గ్రామ యూత్ అధ్యక్షుడు కందాల అశోక్, పులిగిల్ల నరేశ్, రాయపర్తి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే, దామెర మండలంలో నిరుద్యోగుల నుంచి ఎంపీపీ కాగితాల శంకర్ దరఖాస్తులు స్వీకరించారు. మండలంలోని ల్యాదెళ్లలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోలీస్, గ్రూప్స్‌కు సంబంధించిన శిక్షణ కోసం ఈ నెల 12న పరకాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మెంతుల రాజు పాల్గొన్నారు.