ఆత్మకూరు, ఏప్రిల్ 3 : అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూ రు చేస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కటాక్షపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులతో ఆదివారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, పోలీ స్ అధికారుల సమక్షంలో డ్రా పద్ధతిలో 60 మంది లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నిర్మించిన 60 ఇండ్లలో ఈ నెల 6న సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్ హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలతారజినీకర్, సర్పంచ్ మచ్చిక యాదగిరి, రెడ్ క్రాస్ డైరెక్టర్ దుంపల్లపల్లి బుచ్చిరెడ్డి, తహసీల్దార్ సురేశ్‌కుమార్, సీఐ గణేశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దంపతులకు శుభాకాంక్షలు
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జ్యోతి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ భద్రకాళీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు చల్లా దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని గజమాలతో సన్మానించి కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి సారంగపాణి, ఆత్మకూరు ఎంపీపీ మార్క సుమలత, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ వంగాల స్వాతి భగవాన్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు నత్తి సుధాకర్, వీర్ల వెంకటరమణ, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు పాపని రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నూతన పంచాంగం ఆవిష్కరణ
శ్రీ శుభకృత్ నామ సంవత్సర నూతన పంచాంగాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. పరకాలలోని భవానీ కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గందె వెంకటేశ్వర్లు హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పరకాల వైస్ ఎంపీపీ ఇంతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బిల్లా రమణారెడ్డి, గండు రాము తదితరులు పాల్గొన్నారు.