నల్లబెల్లి, ఏప్రిల్ 3: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రూ. 1.80 కోట్ల నిధులతో పలు గ్రామాలకు మంజూరైన బీటీ, సీసీరోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ది మాట్లాడుతూ కరోనా వల్ల రోడ్ల శంకుస్థాపనలకు కొంత ఆలస్యమైందన్నారు. రూ. 90 లక్షలను ఎంఆర్ఆర్ గ్రాంటు ద్వారా తనకు వచ్చిన కోటా నుంచి పంతులపల్లి, మామిండ్లవీరయ్యపల్లి, కన్నారావుపేటకు 500 మీటర్ల సీసీరోడ్డుతోపాటు ఊరు బయట బీటీరోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వేసవి చివరి నాటికి బీటీ పనులు పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు పెద్ది హామీ ఇచ్చారు. ఒల్లెనర్సయ్యపల్లికి శాశ్వత రోడ్డు కోసం రూ. 90 లక్షలతో ఊరి బయట బీటీరోడ్డుతోపాటు గ్రామంలో 200 మీటర్ల సీసీరోడ్డు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రూ. 1.80 కోట్ల నిధులతో రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా ఏమైనా మిగిలి ఉన్న పనుల కోసం ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 5 లక్షలను త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉండడం వల్ల వ్యవసాయ భూముల రేట్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అలాగే, అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలకు వచ్చేందుకు సులభంగా ఉంటుందన్నారు. అన్ని గ్రామాలకు లింకురోడ్లను త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడ్గుల సునీతా ప్రవీణ్, వైస్ ఎంపీపీ గద్దె శ్రీలతా శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, సర్పంచ్‌లు గోనె శ్రీదేవి, ఊరటి అమరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన నాయకులు
ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని నల్లబెల్లి మండలంలోని పలు కుల సంఘాల బాధ్యులు కలిశారు. మున్నూరుకాపు సంఘం మండల, గ్రామ నూతన కమిటీ సభ్యులు నల్లబెల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో కలిశారు. మున్నూరుకాపులు సంఘటితంగా సేవా కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు మండలకేంద్రంలోని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కస్తూరి రవీందర్, కో ఆర్డినేటర్ మేడపల్లి సుధాకర్, జిల్లా కమిటీ సభ్యుడు ఆకుల మధు, గౌరవ అధ్యక్షుడు ఆకుల సాంబరావు, ప్రధాన కార్యదర్శి కొలగాని రామారావు, కోశాధికారి జంగిలి శంకరయ్య, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు జంగిలి పద్మ, కార్యదర్శి మేడపల్లి శ్రీదేవి, యూత్ అధ్యక్షుడు పుప్పాల రాము, కార్యదర్శి కొలగాని రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ నర్సంపేట మండల నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పెద్దిని కలిశారు. ఇటుకాలపల్లి 8వ వార్డు సభ్యుడు బొడిగె వినయ్, మాదన్నపేట పెద్ద చెరువు మత్స్యశాఖ కార్యదర్శి, టీఆర్ఎస్ మండల నాయకుడు మండల రాజమౌళితోపాటు రమేశ్, రాజు, రవి, సురేశ్, శ్రీనివాస్, రవీందర్, నర్సింహ, సంపత్ ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.