వరంగల్, నవంబర్ 19(నమస్తేతెలంగాణ) : నల్ల చట్టాల రద్దు సీఎం కేసీఆర్ విజయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ.. నల్ల చట్టాలు రైతులకు ఉరితాళ్లని సీఎం ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారన్నారు. విద్యుత్ విషయంలోనూ కేంద్రం కొర్రీలు పెట్టకుండా ఉండాలని కోరారు. నర్సంపేట రైతుల వర ప్రదాయని రామప్ప, రంగాయ చెరువు ప్రాజెక్టుపై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు ఇబ్బందులు కలుగుతున్నట్లు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని సేకరించడంలో ఇబ్బందులు సృష్టిస్తోందని తెలిపారు. నల్ల చట్టాలను రద్దు చేసినట్లుగానే రైతాంగ వ్యతిరేక విధానాలను కేంద్రం విడనాడాలని కోరారు.
సంఘటితంగా సాధించుకున్న రైతులు…
పోరాటాల ఫలితంగానే సాగు చట్టాల రద్దు..