ఖానాపురం, నవంబర్ 19: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం శుభపరిణామమని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. మనుబోతులగడ్డలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని రద్దు చేసే వరకూ రైతులను సంఘటితం చేసి టీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తుందని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. రైతుల కోసం దేశంలో మరెక్కడా లేనివిధంగా పథకాలను రూపొందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ వల్లెపు సోమయ్య, సొసైటీ డైరెక్టర్ ఆబోత్ అశోక్, బొప్పిడి పూర్ణచందర్రావు, బాలునాయక్, పూలునాయక్, తక్కళ్లపల్లి బాబురావు, నామాల రవి, సొసైటీ సిబ్బంది రాజు, వినయ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
చెన్నారావుపేట/రాయపర్తి/వర్ధన్నపేట: సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని చెన్నారావుపేట జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్ అన్నారు. చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ పీఏసీఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మురహరి రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, సర్పంచ్‌లు సిద్ధెన రమేశ్, జాటోత్ స్వామినాయక్, ఎంపీటీసీ కడారి సునీతాసాయిలు, సీఈవో నార్లాపురం ఎల్లయ్య, సొసైటీ డైరెక్టర్లు అనుముల రవి, మల్లాడి వీరారెడ్డి, ముస్కు ఐలయ్య, అనుముల యాకాంతం, మాదారపు నర్సయ్య, బండి స్వరూపామల్లయ్య, అలువాల శాంతమ్మ పాల్గొన్నారు. అలాగే, రాయపర్తి మండలంలోని జగన్నాథపల్లి, కొండూరు, కేశవాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు ప్రారంభించారు. నిర్వాహకులు రైతులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల నాయకుడు పూస మధు, సర్పంచ్‌లు గూడెల్లి శ్రీలతా శ్రీనివాస్, కర్ర సరితా రవీందర్‌రెడ్డి, చిర్ర ఉపేంద్ర, చిలుముల్ల ఎల్లమ్మ- యాకయ్య, దేదావత్ కమలమ్మ-వెంకన్న, ఆలకుంట్ల రాజేందర్, ఏపీఎం పులు అశోక్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ జక్కుల వెంకట్‌రెడ్డి, సీఈవో శ్రీపాది యాదగిరి, బద్ధం రంగారెడ్డి, అనంతుల కృష్ణారెడ్డి, డైరెక్టర్లు నకిరెడ్డి రాజిరెడ్డి, దేదావత్ జగన్, వంగాల నర్సయ్య, చిట్యాల వెంకటేశ్వర్లు, తోట నర్సింగం, ఆవుల కేశవరెడ్డి, గజ్జి శ్రీను, ముత్తడి సాగర్‌రెడ్డి, గుగులోత్ బీకోజీ, జీ సుందర్నాయక్, పున్నమయ్య పాల్గొన్నారు. అలాగే, వర్ధన్నపేట మండలంలోని కట్య్రాలలో సర్పంచ్ గుజ్జ సంపత్‌రెడ్డి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. గ్రామైక్య సంఘం ప్రతినిధులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.