వరంగల్, ఫిబ్రవరి 6(నమస్తేతెలంగాణ) : ప్రజలకు వైద్య సేవలను విస్తృతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ డివడిగా ఆడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో కొత్తగా ప ల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలను మెరుగు పరుస్తున్నది. పడకల పెంపుతో అదనపు వసతులు కల్పిస్తున్నది. కొరత లేకుండా వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నది. ఉత్తర తెలంగాణకు గుండెకాయ వంటి వరంగల్ ఎంజీఎం హా స్పిటల్‌లో వైద్యుల నియామక ప్రక్రియ కొనసాగుతున్న ది. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ పడకల సంఖ్యనూ పెం చింది. నూతనంగా మరో రెండు పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాం ట్ల ఇన్స్టాలేషన్ జరిగింది. వీటికితోడు దవాఖానలోని పిల్లల విభాగంలో అదనపు సౌలత్లు కల్పిస్తున్నది. కొ త్తగా ఇంకో 42 పడకలను సమకూర్చే పనిలో ఉంది. ప్ర స్తుతం పిల్లల విభాగం 170 పడుకలతో పనిచేస్తున్నది. వీటిలో ఐసీయూ బెడ్స్ యాభై వరకు ఉన్నాయి. కరోనా ఉధృతి దృష్ట్యా ఇక్కడ అదనపు వసతులు కల్పించేందు కు ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్‌వేవ్ పిల్లలపై ప్రభావం చూపొచ్చని, ఈ విభాగంలో అడ్మిషన్లు పెరగొచ్చనే అంచనాతో అదనంగా మరో 42 పడుకల ఏర్పాటుకు ఉత్తర్వులు విడుదల చేసింది. వీటిలో ఐసీయూ బెడ్స్ 8, నార్మల్ బెడ్స్ 34 ఉంటాయి. ఇప్పటికే ప్రభు త్వం బెడ్స్, వెంటిలేటర్లు, బేబీ వార్మర్స్ వంటివి సమకూర్చింది. కొద్దిరోజుల నుంచి ఈ అదనపు బెడ్స్ ఏర్పా టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. బెడ్స్ ఏర్పాటుకు గదులనూ నవీకరిస్తున్నారు.
బొమ్మలతో ప్రత్యేక యూనిట్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. అదనపు పడకలతో పిల్లల విభాగంలో బెడ్ల సంఖ్య 212కి చేరనుంది. దీంతో పిల్లలకు అదనంగా వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు 170 పడకల ద్వారా పిల్లలకు లభిస్తున్న వైద్య సేవలు మరో కొద్దిరోజుల్లో 212 పడకల ద్వారా అందనున్నాయి. ప్రధానంగా చికిత్స కో సం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ దవాఖానలకు తీసుకెళ్లి ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉండొద్దని, ప్రభుత్వ దవాఖానల్లో పిల్లలకు మరింత మె రుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంజీఎంలోని పిల్లల విభాగంలో అదనపు వసతులు క ల్పించేందుకు రంగంలోకి దిగింది. 42 అదనపు పడకలతో సిద్ధమవుతున్న ఈ విభాగంలోని ప్రత్యేక యూనిట్ ప్రారంభానికి ముస్తాబు అవుతున్నది. ఈ నెల 10వ తేదీన ఉదయం 10.45 గంటలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ బీ శ్రీనివాసరావు వెల్లడించారు. మంత్రి హరీశ్‌రావు పర్యటన ఖరారు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.