హనుమకొండ చౌరస్తా, జూన్ 11: వరంగల్.. విద్యాకేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు నిలయంగా మారింది. వరంగల్ కేంద్రంగా కాకతీయ యూనివర్సిటీ నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్ కాజీపేటలో ఉంది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు 210, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు 81, వృత్తివిద్యా కాలేజీలు 80, ప్రభుత్వం విద్యా కాలేజీలు 24 ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఆయా విద్యాసంస్థలు మేటి చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఎన్నో కొత్త ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. సరికొత్త ప్రయోగాలు చేస్తూ శాస్త్రవిజ్ఞానంతో మేధో సొంతం చేసుకుంటూ ఓరుగల్లు పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్నాయి. భవిష్యత్ సాంకేతిక భారతానికి మన దగ్గర నుంచి బంగారుబాటలు పరుచుకుంటున్నాయి. కొత్త ఆవిష్కరణలు చేయడమే కాకుండా వాటికి మేధో హక్కులు పొందేందుకు ఇక్కడి విద్యాసంస్థల్లో తగిన ప్రోత్సాహం లభిస్తోంది. మన దగ్గర గుణాత్మకమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి.
కేయూ, నిట్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, కాలేజీలు సైతం తమ విద్యార్థుల కోసం ఇన్నోవేషన్ కేంద్రాలను నెలకొల్పుతున్నాయి. ఇక్కడి విద్యాసంస్థలు విద్యార్థుల ఆవిష్కరణలకు తగిన వసతులు కల్పిస్తున్నాయి. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు విద్యాసంస్థల్లో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగరీత్యా దేశ, విదేశాల్లో స్థిరపడిన వారు ఉండగా, రాజకీయ ప్రతినిధులు, వైద్యులు, ఇంజినీర్లుగా విద్యాసంస్థలు
గణనీయంగా ఉన్నత విద్య నాణ్యత హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఉన్న వరంగల్ ఇప్పటికే విద్యాకేంద్రంగా గుర్తింపు పొందింది. నిట్, కాకతీయ యూనివర్సిటీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేరు పొందాయి. దానికనుగుణంగా మరిన్ని సంస్థలను జోడించే దశకు చేరుకుంది. ఉన్నత విద్యాకేంద్రంగా ఉన్న వరంగల్లోని విద్యాసంస్థలు నాణ్యతను గణనీయంగా పెంచడం విశేషం.