ఖిలా వరంగల్ : ఇటీవల ఐఓక్యూఎం (ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైర్ ఇన్ మ్యాథమెటిక్స్)-25 ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత ఒలింపియాడ్ పరీక్షలో వరంగల్‌లోని పుప్పాలగుట్ట ఇండియన్ హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి పాఠశాల ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ పరీక్షలో విజయాదుందుబీ మోగించిన 15 మంది విద్యార్థులను హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు.
అభినందనల వెల్లువ
ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ వన్నాల గోవిందరాజులు, ప్రిన్సిపాల్ వన్నాల ఉమాదేవి, గణిత శాస్త్రం ఉపాధ్యాయులు మహ్మద్ ఖలీద్, విజయ్ శంకర్లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి పోటీ పరీక్షల్లో మరింతగా రాణించడానికి ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.
ప్రశంసా పత్రాలు సాధించిన ఆయేషా, సహస్ర, ప్రజ్వల్ కుమార్, చరణ్ తేజ్, తహసీన్ ఫాతిమా, అశ్విక్
సనూల్లాహ్, మీనాక్షి, హరిణి, తేజస్వి ,శ్రీసాన్యు, సారిక, విద్య, ముత్తు, వంశీ, అక్షయ, హాసిని, కీర్తిప్రియలను
పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.