గత అసెంబ్లీ ఎన్నికల సయమంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ఏడాదికి రెండుసార్లు రైతు భరోసా పథకం ద్వారా రూ. 15 వేలను ప్రతి రైతుకు అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వానకాలం రైతు భరోసాకు రాంరాం పలికిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం జిల్లా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లింది. బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఖిలావరంగల్, అక్టోబర్ 20: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రైతులు త్వరలోనే బొంద పెడుతారని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఖిలావరంగల్ పడమర కోటలోని అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. రైతు రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నన్నపునేని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ హయాంలో ఎకరానికి రూ. 10 వేలు పంట పెట్టుబడి సాయం అందిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం ద్వారా రూ. 15 వేలు ఇస్తామని ముఖం చాటేసిందని విమర్శించారు. రైతుల గోస పట్టించుకోకుండా మంత్రి సురేఖ సినీపరిశ్రమపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, ఏఎంసీ మాజీ చైర్మన్ టీ రమేశ్‌బాబు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ హరి రమాదేవి, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, సంగరబోయిన ఉమేశ్, పోలెపాక రాజు, దిండిగాల సోమేశ్వర్, వేల్పుగొండ యాకయ్య, ఎండీ అంకూస్, మేకల ఎల్లయ్య, బొజ్జ రాజ్‌కుమార్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట: వానకాలం రైతు భరోసాకు రాంరాం పలికిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుద్దని మాజీ జడ్పీటీసీ పత్తినాయక్ అన్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల ప్రకటనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు మండలకేంద్రంలో రాస్తారాకో నిర్వహించారు. రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో కంది కృష్ణచైతన్యరెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ చింతకింది వంశీ, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, బాల్నె వెంకన్న, తూటి శ్రీనివాస్, మురహరి రవి, బోడ బద్దూనాయక్, అనుముల కుమారస్వామి, అమ్మ రాజేశ్, మల్లయ్య, హంస విజయరామరాజు పాల్గొన్నారు.
నెక్కొండ: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, న్యాయవాది కొమ్ము రమేశ్‌యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు నెక్కొండలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాటోత్ రమేశ్‌నాయక్, మాజీ జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తాటిపెల్లి శివకుమార్, పట్టణ అధ్యక్షుడు కొణిజేటి భిక్షపతి, నాయకులు మాదాసు రవి, కర్పూరపు శ్రీనివాస్, మహ్మద్ ఖలీల్, గాదె భద్రయ్య, ఆలకుంట సురేందర్, తోట సాంబయ్య, దేవనబోయిన వీరభద్రయ్య, తడుగుల జనార్దన్, చీకటి శ్రీనివాస్, బొడ్డుపెల్లి రాజు, ఈదునూరి శ్రీనాథ్ పాల్గొన్నారు.
నల్లబెల్లి: రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుంటే రణమేనని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి హెచ్చరించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతృత్వంలో 365 జాతీయ రహదారిపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. గత ఎన్నికల్లో 420 వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్‌రావు, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఖానాపురం: రైతు భరోసాపై మాటమార్చిన కాంగ్రెస్‌కు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య అన్నారు. వానకాలం పంటకు రైతు భరోసా ఇవ్వలేమని ప్రభుత్వం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపు మేరకు మండలకేంద్రంలోని రెండో బస్టాండ్ సెంటర్లో జాతీయ రహదారిపై ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.
కార్యక్రమంలో బత్తిని శ్రీనివాస్‌గౌడ్, జాటోత్ బాలునాయక్, మాజీ సర్పంచ్‌లు ప్రవీణ్‌కుమార్, బూస అశోక్, వెంకన్న, సుమన్, జాటోత్ అశోక్, ఎంపీటీసీలు షేక్ సుభాన్‌బీ, మౌలా నా, కవిత రామస్వామి, బోడ పూలు, భారతి, సొసైటీ వైస్ చైర్మన్ వేణుకృష్ణ, డైరెక్టర్ అశోక్, బందారపు శ్రీను, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ అజహర్, అల్లావొద్దీన్, నాగరాజు, వెంకన్న పాల్గొన్నారు.
వర్ధన్నపేట: ఎకరాకు రూ. 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా నాయకులు మార్గం భిక్షపతి, గుజ్జ గోపాల్‌రావు, గుజ్జ సంపత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రైతు సమస్యలపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తూళ్ల కుమారస్వామి, చొప్పరి సోమయ్య, సిలువేర కుమారస్వామి, కొండేటి శ్రీనివాస్, ఎండీ రహీం, వేణుగోపాల్, రవి, మహేశ్, కుమారస్వామి, రాజమణి, ఉమ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: రైతు భరోసా ఎగవేతపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌పై భగ్గుమన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్, తెలంగాణతల్లి విగ్రహం వద్ద ధర్నా, రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ వానకాలం రైతు భరోసాను ఎగగొట్టడం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడమేనన్నారు. బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్, పట్టణ కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు నాగిశెట్టి పద్మ-ప్రసాద్, గందె రజిత-చంద్రమౌళి, మార్కెట్ మాజీ డైరెక్టర్ పెరుమాండ్ల ప్రభాకర్‌రెడ్డి, పెండెం వెంకటేశ్వర్లు, పుట్టపాక కుమారస్వామి, మేడిద శ్రీనివాస్, రాయరాకుల సారంగం, పెండ్యాల యాదగిరి, సుదర్శన్, బీరం నాగిరెడ్డి, వేణు, రఘు, సాంబయ్య, అనిల్, సంతోష్, రాజేందర్, వీరన్న, స్వామి, రాజు, సురేశ్, సాలయ్య, లక్ష్మీనారాయణ, ప్రసాద్, బాబు పాల్గొన్నారు. అలాగే, మహేశ్వరంలో నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు ఈర్ల నర్సింహరాములు, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోటూరి రవి, తాళ్లపల్లి రాంప్రసాద్, కట్ల సుదర్శన్‌రెడ్డి, అల్లి రవి, మంచిక రాజుగౌడ్, బండారి మల్లయ్య, వల్లాల కరుణాకర్‌గౌడ్, సంకటి గణపతిరెడ్డి, చేరాల గోవర్ధన్, నర్సింగం, రమేశ్, రాజు, సంపత్, దేవేందర్, సురేశ్, వెంకన్న, తిరుపతి పాల్గొన్నారు.
పర్వతగిరి: మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతు భరోసా ఇచ్చే వరకూ కాంగ్రెస్‌ను వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కల్లెడ పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్‌గౌడ్, మార్కెట్ మాజీ డైరెక్టర్ బోయినపెల్లి యుగేంధర్‌రావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చింతపట్ల సోమేశ్వర్రావు, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు మాడుగుల రాజు, కర్మిళ్ల మోహన్‌రావు, మహిళా అధ్యక్షురాలు బరిగెల విజయ, మాజీ సర్పంచ్‌లు అమడగాని రాజు, ఏర్పుల శ్రీనివాస్, బానోత్ వెంకన్న, బండి సంతోష్‌గౌడ్, ఈర్యానాయక్, వెంకటేశ్వర్లు, రాజు, గంధం బాలరాజు, మాధవరావు, సంపత్‌రావు, మాసాని వెంకట్, వంశీరావు, గడ్డి యాకయ్య, లక్ష్మీనారాయణ, మాజీ ఉపసర్పంచ్లు ధర్నోజు దేవేందర్, సూర అశోక్, రైతు విభాగం అధ్యక్షులు బాల్య వెంకట్రాజం, భూక్యా వీరన్న, మేరుగు వెంకన్న, చిరుత విజయ్, రామలింగం, దొమ్మటి రాజు, దండు అశోక్, రాపాక ప్రభాకర్, రాజశేఖర్, శ్రీకాంత్, అజయ్, రైతులు పాల్గొన్నారు.
దుగ్గొండి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రైతు భరోసా పథకానికి నిధులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గిర్నిబావి సెంటర్లో రూణమాఫి, రైతు భరోస కార్యక్రమాన్ని తక్షణమే రైతాంగానికి అందిచాలాని దర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు,క్లష్టర్ ఇంచార్జిలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.